David Warner Retirement : అంతర్జాతీ క్రికెట్‌లో మరో దిగ్గజ ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించిన తర్వాత కంగారు జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
సెయింట్ లూసియాలో భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, వార్నర్ 6 పరుగులే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ గెలవడం వల్ల టీ 20 ప్రపంచకప్ సెమీస్ చేరే అవకాశం ఆస్ట్రేలియాకు లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు వార్నర్ ప్రకటించాడు.
దాదావు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్, టీ 20 ప్రపంచకప్ గెలిచి రిటైర్‌మెంట్ ప్రకటించుదామని అనుకున్నాడు. కానీ ఈ టోర్నీ వల్ల వార్నర్‌కు నిరాశ తప్పలేదు.
అయితే ఇప్పటికే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు చెప్పిన వార్నర్, ఇప్పుడు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు చెప్తున్నట్లు వెల్లడించాడు. భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌తోనే వార్నర్ చివరి వన్డే ఆడాడు. జనవరిలో పాకిస్థాన్‌పై చివరి టెస్ట్ ఆడాడు. ఈ టీ 20 ప్రపంచకప్ తనకు చివరి టోర్నమెంట్ అని ఈ టోర్నీకి ముందే వార్నర్ ప్రకటించాడు. అన్నట్లుగానే వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
టీ20కి రిటైర్మెంట్ పలికాడు కానీ!
టీ20 ప్రపంచక్‌కు వీడ్కోలు పలికినా వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వార్నర్ తెలిపాడు. తన అవసరం ఉందనుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానని వార్నర్ తెలిపాడు. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయి.
టెస్ట్ క్రికెట్, వన్డే, టీ 20ల్లో వార్నర్ లేనిలోటు కొన్నేళ్లపాటు ఉంటుందని హేజిల్ వుడ్ అన్నాడు. వార్నర్ కెరీర్ ముగియడం తనను నిరాశ పరిచేలా చేసిందని, కానీ తాము నిరాశలో మునిగిపోతే ముందుకు సాగలేమని హెడ్ అన్నాడు. అన్ని ఫార్మాట్లలో వార్నర్ ఓపెనర్‌గా ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడని హెడ్ గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు వార్నర్ చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడాడు.
2011లో ఆస్ట్రేలియా తరుపున సుదీర్ఘ ఫార్మట్‌లో అరంగ్రేటం చేసిన వార్నర్, తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడి 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశాడు. టెస్టుల్లో వార్నర్ 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్ అత్యధిక స్కోరు 335. 161 వన్డేల్లో వార్నర్ 22 శతకాలు, 33 అర్ధ శతకాలతో 6932 పరుగులు చేశాడు. 110 టీ20ల్లో ఓ సెంచరీతో 3277 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వార్నర్ లీగుల్లో కనిపించే అవకాశం ఉంది.
'హ్యాపీగా ప్లేస్ ఖాళీ చేస్తా- రిటైర్మెంట్పై వార్నర్ ఎమోషనల్'
సొంతగడ్డపై అరుదైన రికార్డు - టీ20ల్లో 12 వేల పరుగుల మైల్స్టోన్ దాటిన వార్నర్