Daryl Mitchell CSK :ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ చేస్తున్న చెన్నై జట్టు ప్లేయర్ డారిల్ మిచెల్ అనుకోకుండా ఓ అభిమాని ఫోన్ పగులగొట్టాడు. ఇంతకీ ఆ ఘటన ఎలా జరిగిందంటే?
మ్యాచ్‌కి ముందు మిచెల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అదే సమయంలో అతడు ఓ భారీ షాట్ ఆడాడు. ఆ బాల్ కాస్త స్టేడియంలో స్టాండ్స్ వైపుకు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ ఫ్యాన్ చేతిలో ఉన్న ఐఫోన్‌కు తగిలింది. దీంతో ఆ ఫోన్ విరిగిపోయింది. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న మిచెల్, ఆ అభిమానికి క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా తన బ్యాటింగ్ గ్లవ్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇక ఈ విషయాన్ని ఆ అభిమాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ వైపు ఆ ఫ్యాన్‌కు జరిగిన నష్టం గురించి మాట్లాడుకుంటూనే, మరోవైపు మిచెల్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. అతడి మంచి మనసుకు ఫిదా అవుతున్నారు.