Cristiano Ronaldo YouTube:పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డు కొట్టాడు. అయితే ఈసారి రికార్డు మైదానంలో కాదు, ఇంటర్నెట్లో ఘనత సాధించాడు. రొనాల్డో రీసెంట్గా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అయితే ఈ ఛానెల్‌కు ఊహించని రేంజ్లో స్పందన వచ్చింది. కేవలం 90 నిమిషాల్లోనే 10లక్షల మంది నెటిజన్లు రొనాల్డో ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేశారు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో 1మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి వ్యక్తిగా ఘనత సాధించాడు.
ఇక ఛానెల్ ప్రారంభించిన 12గంటల్లోపే ఏకంగా 13 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు అయ్యారు. దీంతో యూట్యూబ్ మేనేజ్మెంట్ రొనాల్డోకు 'గోల్డెన్ ప్లే' బటన్ అందించింది. అలా ఛానెల్ ప్రారంభించిన రోజే రొనాల్డో 'గోల్డెన్ ప్లే' అందుకున్నాడు. తన ఛానెల్ ప్రారంభం సందర్భంగా 'వెయిటింగ్ ముగిసింది. ఇది నా యూట్యూబ్ ఛానల్. అందరూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. కొత్త ప్రయాణంలో మీరందరూ చేరండి' అని రొనాల్డో క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, ఈ ఫుట్‌బాల్ లెజెండరీకి ట్విట్టర్లో 112.6మిలియన్, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 636 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే రొనాల్డో తన రెగ్యులర్ అప్డేట్స్ షేర్ చేస్తుంటాడు.
అతడికి 132 రోజులు, రొనాల్డోకు 12 గంటలే
అమెరికాకు చెందిన జేమ్స్ స్టీఫెన్ తన యూట్యూబ్ ఛానెల్ 'మిస్టర్ బీస్ట్'కు 132 రోజుల్లో 10మిలియన్ల సబ్‌స్క్రైబర్లు అయ్యారు. ఈ క్రమంలో స్టీఫెన్ అతి తక్కువ సమయంలో ఈ మైలురాయి అందుకున్న యూట్యూబర్‌గా నిలిచాడు. కాగా, రొనాల్డో ఆ మైలురాయిని కేవలం 12 గంటల్లోపే బద్దలుకొట్టి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.