తెలంగాణ

telangana

ETV Bharat / sports

తండ్రైన సర్ఫరాజ్ ఖాన్- ఫొటో షేర్ చేసిన క్రికెటర్

తండ్రి అయ్యిన సర్ఫరాజ్- మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ భార్య

Sarfaraz Khan Son
Sarfaraz Khan Son (Associated Press)

By ETV Bharat Sports Team

Published : 8 hours ago

Sarfaraz Khan Son :టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తాజాగా తన అభిమానులకు ఓ శుభవార్త అందించాడు. అతడు తండ్రి అయ్యాడు. సోమవారం సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని యువ క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన కుమారుడితో దిగిన ఓ అపురూపమైన ఫొటోను షేర్ చేశాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్​కు అభిమానులు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, 2023 ఆగస్టు 06న సర్ఫరాజ్ ఖాన్​- రొమానా జహూర్ వివాహం జరిగింది. వీరిద్దరూ జమ్ము కశ్మీర్​లోని షోపియన్​ జిల్లాలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

కొడుకుతో సర్ఫరాజ్ ఫొటో (Sarfaraz Khan Insta Screen Shot)

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ వార్త ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవలె జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియాకు ఓ మర్చిపోలేని ఇన్నింగ్స్ అందించాడు. జట్టుకు పరుగులు అవసరమైనప్పుడు 150 పరుగులు స్కోర్ చేశాడు. అలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి క్లిష్ట పరిస్థితుల నుంచి భారత్‌ను రక్షించాడు. అయితే ఈ సిరీస్​లో టీమ్ఇండియా గెలవలేకపోయింది. అంతకుముందు ఇరానీ కప్‌లో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ సాధించాడు.

ఇక సర్ఫరాజ్ కెరీర్ విషయానికి వస్తే,టీమ్ఇండియా తరఫున మూడు 4 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ 325 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. అలాగే 50 ఐపీఎల్ మ్యాచ్​లు ఆడిన సర్ఫరాజ్ 585 పరుగులు బాదాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

రంజీల్లో అదుర్స్ -సర్ఫరాజ్ ఖాన్ 1997 అక్టోబరు 22న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్​పై ఆసక్తి ఉన్న సర్ఫరాజ్​ రంజీల్లో ఆడాడు. ఐపీఎల్​లో 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అలాగే దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. 2022-23 రంజీ సీజన్​లో ఏకంగా 122.75 సగటుతో 982 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. తాజాగా కివీస్​తో జరుగుతున్న సిరీస్​లో చోటు దక్కించుకుని ఆదరగొడుతున్నాడు.
తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్​లో సర్ఫరాజ్- దిగ్గజాల సరసన చోటు

సర్ఫరాజ్​ ఖాన్ మెరుపు సెంచరీ - కెరీర్​లో ఇదే మొదటిది

ABOUT THE AUTHOR

...view details