Pujara Ranji Trophy Century : టీమ్ ఇండియాకు దూరమైన స్టార్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా తాజాగా రంజీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. సోమవారం రాజ్ కోట్ వేదికగా ఛత్తీస్ గఢ్ - సౌరాష్ట్రకు మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో శతక్కొట్టాడు. దీంతో పుజారా తన ఖాతాలో 25వ రంజీ ట్రోఫీ శతకాన్ని వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది అతనికి 66వ శతకం.
లారా రికార్డు బ్రేక్! - పుజారా 197 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్ గఢ్ 578 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర నిలకడగా ఆడుతోంది. పూజారా సెంచరీతో చేయడం వల్ల మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీల్లో(65) విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను పుజారా అధిగమించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా పుజారా రికార్డుకెక్కాడు. పూజారా 273 మ్యాచుల్లో 21,000 పరుగులు బాదాడు.
- అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్లు
సునీల్ గావస్కర్ - 81
సచిన్ తండూల్కర్ - 81
రాహుల్ ద్రవిడ్ - 68
ఛతేశ్వర్ పుజారా - 66
అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్లు
సునీల్ గవాస్కర్ - 25834
సచిన్ టెండూల్కర్ - 25396
రాహుల్ ద్రవిడ్ - 23784
ఛతేశ్వర్ పుజారా - 21015* –
రంజీల్లో అదరగొడుతున్న పుజారా
ఇక పుజారాను భారత టెస్టు జట్టు నుంచి తప్పించి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చివరిసారిగా టీమ్ఇండియా తరఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో విఫలమయ్యాడు. దీంతో పుజారాపై వేటుపడింది. అయితే దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత రంజీ సీజన్లో 8 మ్యాచుల్లో 69.08 సగటుతో 829 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ కౌంటీల్లోనూ సెంచరీలు కొడుతూ తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్ 'దిల్లీ' ప్రపోజల్‌కు బీసీసీఐ నో