ETV Bharat / spiritual

గురువారం జస్ట్ "రూపాయి కాయిన్"​తో ఇలా చేయండి! - లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట డబ్బుల వర్షమే! - HOW TO ATTRACT GODDESS LAKSHMI

సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందాలంటే - ప్రతి గురువారం ఇలా చేయాలట!

HOW TO ATTRACT GODDESS LAKSHMI
Easy Ways To Attract Goddess Lakshmi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 10:46 PM IST

Easy Ways To Attract Goddess Lakshmi : "ధనం మూలం ఇదం జగత్" అన్నారు పెద్దలు. ధనం లేకపోతే ఏ పనులు కావు. మరి.. ధనం రావాలంటే కష్టించి పని చేయాలి. అంతే.. కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం లేకపోతే ఇంట్లో రూపాయి నిల్వదు! ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే.. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి, అప్పుల బాధలు లేకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే గురువారం ఈ పరిహారం పాటించాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్. అదేంటంటే.. ప్రతి గురువారం పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అయితే, దీపం పెట్టినప్పుడు ఆ నూనెలో ఒక రూపాయి కాయిన్ వేయాలి. ఆపై శ్రీ మహాలక్ష్మికి పాయసాన్ని నైవేద్యగా సమర్పించి తర్వాత అందరూ స్వీకరించాలి. ఇలా.. 3 లేదా 12 లేదా 21 గురువారాలు చేయాలట.

అలాగే.. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి కాయిన్​ని తీసి ఒక కొత్త వస్త్రంతో శుభ్రం చేసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఈ విధంగా 3 లేదా 12 లేదా 21 గురువారాలు దీపారాధన పూర్తయిన తర్వాత.. రూపాయి కాయిన్స్ అన్నింటినీ మరోసారి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు, కుంకుమ వేసి మూటకట్టి దాన్ని డబ్బులు దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలట. ఇలా చేయడం ద్వారా మీ ఇంట స్థిర లక్ష్మీ అనుగ్రహం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు.

ఇలా చేస్తే అప్పులు త్వరగా తీరుతాయట!

కొంతమంది ఎంత సంపాదించినా ఖర్చయిపోవడం, ఆర్థిక వృద్ధి లేకపోగా అప్పుల బాధలు పీడిస్తుంటాయి. అలాగే.. కొందరు వివిధ అవసరాల రీత్యా లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ.. లోన్ త్వరగా రాదు! అయితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అప్పులు ఎక్కువగా ఉన్నవారు అవి త్వరగా తీరాలన్నా.. బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించే వారు ఆ లోన్ త్వరగా రావాలన్నా.. ఈ మంగళవారం పని చేయాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.

అదేంటంటే.. మంగళవారం ఆంజనేయస్వామి టెంపుల్​కి వెళ్లి మల్లె నూనెతో(జాస్మిన్ ఆయిల్​) దీపారాధన చేయాలి. ఆ తర్వాత నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలంటున్నారు. ఈవిధంగా 9 మంగళవారాలు చేస్తే.. క్రమక్రమంగా అప్పుల బాధలన్నీ తీరిపోతాయట. అలాగే.. బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించే వారికి త్వరలోనే లోన్ వస్తుందట!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

సాయంత్రం ఈ వస్తువులు కొంటే లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోతుందట! - అవేంటో మీకు తెలుసా?

"మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయా ? - ఈ పరిహారాలు చేస్తే మొత్తం తీరిపోతాయి!"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.