తెలంగాణ

telangana

ETV Bharat / sports

పిచ్​ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం వారిదే! - గ్రౌండ్​ను మెయింటెన్ చేసే స్టాఫ్ శాలరీ ఎంతో తెలుసా?

క్రికెట్ పిచ్​ను మెయింటెన్ చేసే గ్రౌండ్ స్టాఫ్ బాధ్యతలు, శాలరీ వివరాలు ఎంతో తెలుసా?

Cricket Ground Staff Salary
Cricket Ground Staff (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 9, 2024, 7:45 PM IST

Cricket Ground Staff Salary : క్రికెట్ మ్యాచ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్లేయర్స్, అంపైర్లు, కోచ్​లు మాత్రమే. అయితే మ్యాచ్ జరగాలంటే స్టేడియం ఉండాలి. మరిదాన్ని మెయింటెన్ చేసేది గ్రౌండ్ స్టాఫ్. వీరి గురించి ఎవరికి తెలియదు, పట్టించుకోరు. అయితే ఈ స్టోరీలో గ్రౌండ్ స్టాఫ్ శాలరీ ఎంత? వారి విధులు ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

ఇదే వారి పని
పిచ్​ను సిద్ధం చేయడం, ఔట్​ ఫీల్డ్స్ మెయింటెనెన్స్, వర్షం పడినా గ్రౌండ్​లోని నీరు వెళ్లిపోయేటట్లు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి విషయాలను గ్రౌండ్ స్టాఫ్ పర్యవేక్షిస్తారు. అలాగే బౌండరీ రోప్​లను సరి చేస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్​లో గ్రౌండ్ స్టాఫ్​కు నెలకు రూ.30,000 వరకు శాలరీ ఉంటుందని తెలుస్తోంది. దేశాలను బట్టి ఈ జీతం మారే అవకాశం ఉంది.

ఈ అంశాల ఆధారంగా జీతాలు
అనుభవం
అనుభవం, స్టేడియం ఉన్న ప్రదేశం ఆధారంగా గ్రౌండ్ స్టాఫ్ జీతాలు మారవచ్చు. అంతర్జాతీయ క్రికెట్​ను శాసిస్తున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ వంటి దేశాల్లో అధిక జీతాలు ఉండొచ్చు.

బహుమతుల రూపంలో
భారత్ సహా మరికొన్ని దేశాల్లో గ్రౌండ్ స్టాఫ్ శాలరీకి సంబంధించి ఒక సంప్రదాయం ఉంది. జట్లు లేదా క్రికెట్ బోర్డులు మ్యాచ్​ల తర్వాత గ్రౌండ్ స్టాఫ్​కు నగదును బహుమతిగా ఇస్తాయి. పిచ్ మెయింటెనెన్స్​ను బాగా చేస్తే ఈ ప్రోత్సాహకాలను అందిస్తాయి.

ఒప్పందాలు
క్రికెట్ బోర్డులు, క్లబ్​లతో కొంతమంది గ్రౌండ్ స్టాఫ్ ఫుల్​టైమ్ కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఇందులో ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్‌, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. దీంతో గ్రౌండ్ స్టాఫ్ శాలరీ మరింత ఎక్కువ లభిస్తుంది.

గ్రౌండ్ స్టాఫ్​కు ఉన్న సవాళ్లు
స్టేడియం మెయింటెనెన్స్​లో కీలక పాత్ర పోషించినప్పటికీ గ్రౌండ్ స్టాఫ్​కు ఆశించినమేర జీతం రావట్లేదని క్రికెట్ వర్గాల మాట. ప్రపంచకప్​లు లేదా ప్రతిష్ఠాత్మక సిరీస్​ల్లో మాత్రమే క్రికెట్ బోర్డులు వీరికి బోనస్, నజరానా వంటివి ప్రకటిస్తున్నాయట. అందుకే గ్రౌండ్ స్టాఫ్ జీతాలపై చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరగడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రౌండ్ స్టాఫ్​కు ఇంత తక్కువ మొత్తంలో జీతాలేంటని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పిచ్ సరిగ్గా లేకపోతే మ్యాచ్​లు ఆగిపోయే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మ్యాచ్‌లకు బుమ్రా ఉపయోగించే 'షూ' ధర ఎంతో తెలుసా?

LED స్టంప్‌లు వెరీ కాస్ట్​లీ! ధర ఎంతో తెలుసా? - Cricket LED Stumps Cost

ABOUT THE AUTHOR

...view details