PCB Coach Gary Kirtsen:పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాకిస్థాన్ తాత్కాలిక కోచ్‌గా జాసన్ గిలెస్పీని నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాసన్ గిలెస్పీ కోచ్‌గా సరిపోతాడా? అని విమర్శిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న పాక్‌కు గిలెస్పీ విజయాలు అందించగలడా? అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఫ్యాన్స్ ఫైర్
పాకిస్థాన్ జట్టు కోచ్ పదవి నుంచి గ్యారీ కిరిస్టెన్ తాజాగా వైదొలిగాడు. దీంతో ప్రస్తుతం టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న జాసన్ గిలెస్పీకే ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై పాక్ క్రికెట్ అభిమానులు పీసీబీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టాల సుడిగుండంలో ఉన్న పాక్‌ను గెలెస్పీ ఒడ్డెక్కించగలడా అని మండిపడుతున్నారు.
పాక్ హెడ్ కోచ్‌గా గెలెస్పీ నియామకంపై ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం జట్టు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. హెచ్ కోచ్ పదవికి గెలెస్పీ సరిపోతారా అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా సెగ
- అది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కాదు. అది పొలిటికల్ సర్కస్
- బోర్డులో ఇలాగే రాజకీయాలు జరిగితే కొన్నాళ్ల తర్వాత పాక్ జట్టుకు విదేశీ కోచ్‌లు రారు
- ఆకిబ్ జావేద్‌ను హెచ్ కోచ్‌గా చేసేందుకు పీసీబీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది
- పాకిస్థాన్‌ను వదిలిపెట్టినందుకు కిరిస్టెన్‌కు థ్యాంక్స్. ఇప్పుడు మీ కోచింగ్ వారసత్వానికి ఎలాండి ఇబ్బంది ఉండదు
- కిరిస్టెన్ మరో బాబ్ వూల్మర్ కావాలని అనుకోవడం లేదు. ఇప్పట్నుంచి పాపం జాసన్ గిసిప్పీ కోసం ప్రార్థించాలి