తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకే ఓవర్లో 6 సిక్స్​లు - ఫాస్టెస్ట్​​ సెంచరీతో ఆంధ్ర బ్యాటర్ విధ్వంసం - ఒకే ఓవర్లో 6 సిక్స్​లు

CK Naidu Trophy 1 Over 6 sixes : కల్నర్‌ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్‌–23 క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర బ్యాటర్ ఫాస్టెస్ట్​ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో 6 సిక్స్​లు కూడా బాది ఆకట్టుకున్నాడు.

ఒకే ఓవర్లో 6 సిక్స్​లు - ఫాసెస్ట్​ సెంచరీతో  ఆంధ్ర బ్యాటర్ విధ్వంసం
ఒకే ఓవర్లో 6 సిక్స్​లు - ఫాసెస్ట్​ సెంచరీతో ఆంధ్ర బ్యాటర్ విధ్వంసం

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 7:51 AM IST

CK Naidu Trophy 1 Over 6 sixes: కల్నర్‌ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్‌–23 క్రికెట్‌ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్ర జట్టు ఓపెనర్‌ మామిడి వంశీకృష్ణ తన ఆటతో అదరగొట్టాడు. 9 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 64 బంతుల్లో 110 పరుగులు సాధించాడు. రైల్వేస్‌ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఈ ప్రదర్శన చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఈ 22 ఏళ్ల కుర్రాడు మరో అద్భుతం కూడా చేశాడు. ఈ మ్యాచ్​లోనే ఒకే ఓవర్‌లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది సంచలనం క్రియేట్ చేశాడు.

వైఎస్‌ రాజారెడ్డి – ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది ఆంధ్ర జట్టు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 372 పరుగులు చేసింది. అయితే రైల్వేస్‌ లెగ్‌ స్పిన్నర్‌ దమన్‌ దీప్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్లోనే వంశీ కృష్ణ అద్భుతం చేశాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు ధనాధన్ బాదేశాడు.

అనంతరం ఇదే జోరును కొనసాగిస్తూ 48 బంతుల్లోనే శతాకన్ని పూర్తి చేశాడు వంశీకృష్ణ. తద్వారా సీకే నాయుడు ట్రోఫీ హిస్టరీలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా రికార్డుకు ఎక్కాడు. అలా వంశీకృష్ణతో పాటు ఇతర బ్యాటర్లు కూడా మంచిగానే రాణించారు. ధరణి కుమార్‌ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్‌ రాహుల్‌ (61 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్, కెప్టెన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి ప్రదర్శనే చేశారు.

ఒకే ఓవర్​లో 6 సిక్స్​లు:అంతకుముందు అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్‌ (టీమ్ ఇండియా), కీరన్‌ పొలార్డ్‌ (వెస్టిండీస్‌) - ఇంటర్నేషనల్ వన్డేల్లో జస్కరణ్‌ మల్హోత్రా (అమెరికా), హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా) - ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో గ్యారీ సోబర్స్‌ (వెస్టిండీస్‌), లీ జెర్మన్‌ (న్యూజిలాండ్‌), రవిశాస్త్రి (టీమ్​ ఇండియా) - దేశవాళీ టి20ల్లో లియో కార్టర్‌ (న్యూజిలాండ్‌), రోజ్‌ వైట్లీ (ఇంగ్లాండ్), హజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గానిస్థాన్) - దేశవాళీ వన్డేల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (టీమ్​ఇండియా), తిసారా పెరీరా (శ్రీలంక) - ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది అందరి దృష్టిని ఆకర్షించారు.

టీమ్ఇండియాపై బజ్​బాల్ పనిచేయదు గురూ- దూకుడుగా ఆడడం భారత్​కు కొత్తేం కాదు

ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ టీమ్‌ కెప్టెన్‌గా ధోనీ

ABOUT THE AUTHOR

...view details