తెలంగాణ

telangana

ETV Bharat / sports

దుబేకు ఏమైంది? వరల్డ్​కప్​కు ఎంపికైన తర్వాత వరుస డకౌట్లు- ఇలాగైతే కష్టమే! - IPL 2024 - IPL 2024

Shivam Dube Duck Out: 2024 టీ20 వరల్డ్​కప్​కు ఎంపికైన తర్వాత చెన్నై యంగ్ బ్యాటర్ శివమ్ దూబే వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

Shivam Dube Duck Out
Shivam Dube Duck Out (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 5:32 PM IST

Updated : May 5, 2024, 6:16 PM IST

Shivam Dube Duck Out:చెన్నై సూపర్ ​కింగ్స్​ యంగ్ బ్యాటర్ శివమ్ దూబే వరుసగా రెండోసారి డకౌట్​ అయ్యాడు. ఈ సీజన్​లో పంజాబ్​తో ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ దూబే పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మే 1న జరిగిన మ్యాచ్​లో హరిప్రీత్​ బ్రార్​కు వికెట్ సమర్పిచుకోగా, తాజాగా రాహుల్ చాహర్ దూబేను ఔట్ చేశాడు. అయితే టీ20 వరల్డ్​కప్ టోర్నమెంట్​కు ఎంపికైన తర్వాత దూబే ఒక్క పరుగు కూడా సాధించలేదు. దీంతో ఫామ్ కోల్పోయాడంటూ దూబేపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇది టీమ్ఇండియా ఫ్యాన్స్​ను అందోళనలో పడేస్తోంది.

ఈ రెండు మ్యాచ్​ల్లో శివమ్ దూబే స్పిన్నర్లను ఆడడంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. ఈ సీజన్​ ఫస్ట్ హాఫ్​లో అద్భుత ఫామ్​తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన దూబేకు పొట్టికప్​లో ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ, వరల్డ్​కప్​కు ఎంపికైన తర్వాత దూబే ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ గోల్డెన్ డకౌట్ అవ్వడం అభిమానులను కలవర పెడుతోంది. ఇకనైనా దూబే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కితేనే వరల్డ్​కప్​లో తుదిజట్టులో ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే బెంచ్​కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

ఇక ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32 పరుగులు), డారిల్ మిచెల్ (30 పరుగులు) పవర్​ప్లేలో స్కోర్ బోర్డను పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్​కు 57 పరుగులు జోడించారు.

ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో రాహుల్ చాహర్ బ్రేక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో రుతురాజ్​, దూబేను పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ మిచెల్​ను వెనక్కి పంపాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పింది. 101కే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రవీంద్ర జడేజా (43 పరుగులు) కీలక ఇన్నింగ్స్​తో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో 3, అర్షదీప్ సింగ్ 2, శామ్ కరన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

IPLలో రప్ఫాడిస్తున్న 'దూబే'- హార్దిక్ టీమ్ఇండియా ప్లేస్​​పై ఎఫెక్ట్? - Shivam Dube IPL 2024

ఈ క్రెడిట్ మహీ భాయ్​దే- చెన్నై నన్ను నమ్మింది: దూబే

Last Updated : May 5, 2024, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details