తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్స్‌ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా? - CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్​- ఇవి మీకు తెలుసా?

Champions Trophy 8 8 8
Champions Trophy 8 8 8 (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : Feb 19, 2025, 2:21 PM IST

Champions Trophy 8 8 8: క్రికెట్ లవర్స్​ను ఉర్రూతలూగించేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసింది. ఇప్పటివరకు టెస్టులు, టీ20లను ఆస్వాదించిన అభిమానులను వన్డే ఫార్మాట్‌తో ఎంటర్టైన్ చేసేందుకు ఈ మెగా టోర్నీ సిద్ధమైంది. బుధవారమే ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్- న్యూజిలాండ్​ తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి టోర్నీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే?

8-8-8

  • 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. అప్పట్నుంచి 2000, 2002, 2004, 2006, 2009, 2013, 2017 అలా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ 8సార్లు జరిగింది. ఇందులో భారత్ 2002 (శ్రీలంకతో సంయుక్తంగా), 2013లో ఛాంపియన్​గా నిలిచింది
  • ఈ ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు 8 ఏళ్ల తర్వాత అభిమానులను అలరించేందుకు వచ్చింది. చివరిసారిగా 2017లో టోర్నీ జరిగింది. ఆ ఎడిషన్​లో పాక్ టైటిల్ నెగ్గింది. ఇక దాదాపు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టోర్నీ జరుగుతోంది
  • కాగా, ఈ తొమ్మిదో ఎడిషన్​లో టైటిల్‌ కోసం ఇప్పుడు టాప్‌- 8 జట్లు బరిలోకి దిగాయి. ఎనిమిది జట్లు నాలుగేసి చొప్పున రెండు గ్రూప్‌లుగా విడిపోతాయి. ఆ గ్రూప్‌లోని ఒక్కో జట్టు మిగతా టీమ్‌లతో ఒక్కో మ్యాచ్‌ మాత్రమే ఆడతాయి.

మరికొన్ని విశేషాలు

విరాట్, రోహిత్‌కిదే ఆఖరుదా? :టీమ్ఇండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ సీనియర్లిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులో ఉండకపోవచ్చు! ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ గెలిచాక పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన వీళ్లు, ఇప్పుడు ఈ ట్రోఫీని నెగ్గాక వన్డేలకూ గుడ్‌బై చెప్పేస్తారనేది క్రికెట్ వర్గాల్లో చర్చ.

వాళ్లకు తొలిసారి :వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అఫ్గానిస్థాన్‌కు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అఫ్గాన్‌ పాల్గొనడం ఇదే తొలిసారి. గ్రూప్‌ Bలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో పాటు అఫ్గాన్‌ ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు అర్హత సాధించలేకపోయాయి.

ఛాంపియన్స్‌ ట్రోఫీ టీమ్ఇండియా హైలైట్స్- మూడో టైటిల్​పై రోహిత్ సేన గురి!

ఛాంపియన్స్ ట్రోఫీ : ఎవరి బలం ఎంత?- ఎవరి ఛాన్స్​లు ఎలా ఉన్నాయి?

ABOUT THE AUTHOR

...view details