Bumrah Outs Virat Kohli :బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్ట్ కోసం ఇప్పటికే కాన్పుర్‌కు చేరుకున్న టీమ్ఇండియా అక్కడి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగామొదటి మ్యాచ్‌లో అంతగా రాణించని విరాట్ కోహ్లీ రానున్న మ్యాచ్ కోసం ఘోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే, నెట్స్‌లో మాత్రం బుమ్రా వేసిన బంతులను ఎదుర్కోవడంలో మాత్రం అతడు ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం బుమ్రా బౌలింగ్‌లో విరాట్ 15 బంతులను ఎదుర్కోగా, అందులో నాలుగుసార్లు కోహ్లీ ఔటైనట్లు సమాచారం. నాలుగో బంతిని ఎల్బీ రూపంలో చేశాడట. తన బలహీనతగా మారిన అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి కూడా ఎడ్జ్ తీసుకుని క్యాచ్ ఇచ్చేశాడు.
స్పిన్ బౌలింగ్‌లోనూ ప్రాక్టీస్
అయితేకాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుగుణంగా ఉంటుందనే ఉద్దేశంతో కోహ్లీ వారి బౌలింగ్‌లోనూ కఠినంగా ప్రాక్టీస్ చేశాడు. అయితే బంగ్లాతో తొలి టెస్టులో పేస్, స్పిన్‌కు వికెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. మరోసారి అటువంటి అవకాశం ప్రత్యర్థికి ఇవ్వకూడదనే లక్ష్యంతోనే పేస్‌తో పాటు స్పిన్ బౌలర్లపైనా ఫోకస్ పెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్నాడు. అయితే జడ్డూ బౌలింగ్‌లో బంతిని మిస్ అయ్యాడట. దీంతో కోహ్లీ ఆందోళనకు గురైనట్లు ఆ కథనం పేర్కొంది. అక్షర్ పటేల్ బౌలింగ్ సమయంలోనూ డిఫెన్స్ ఆడాడు. అయినప్పటికీ, అతడ్ని బీట్ చేయడంలో విఫలమయ్యాడట. కానీ, మరికొన్ని బంతులను మాత్రం అద్భుతంగా ఆడాడని, భారీ షాట్లును కూడా సంధించాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగగా, తన ప్రాక్టీస్‌ను కోహ్లీ ఆపేశాడట. ఇక ఈ ఇద్దరితో పాటు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా తమ బ్యాట్‌కు పని చెప్పి నెట్స్‌లో చెమటోడ్చారట.
విరాట్ అతి చేరువలో
బంగ్లాతో జరిగే రెండో టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను సాధించే అవకాశం ఉంది. మరో 35 పరుగులు చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 27,000 రన్స్ చేసిన నాలుగో బ్యాటర్‌గా విరాట్ నిలవనున్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో సచిన్, కుమార్ సంగక్కర, పాంటింగ్ మాత్రమే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 27వేల పరుగులు చేశారు. అలాగే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్ లలో 27,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోతాడు కోహ్లీ. కాగా, విరాట్ 593 ఇన్సింగ్స్ల్లోనే 26,965 పరుగులు చేశాడు.