Border Gavaskar Trophy Most Runs :నాలుగు రోజుల్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ సిరీస్‌లో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. అలానే అనేక చరిత్రాత్మకమైన ఇన్నింగ్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇక ఈసారి సిరీస్‌లో ఎలాగైనా నెగ్గాలని ఇరుజట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం.
అత్యధిక పరుగులు చేసిన టాప్-5
- బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉంది. 39 టెస్టుల్లో 55 యావరేజ్‌తో సచిన్ 3,630 పరుగులు బాదాడు.
- ఆసీస్ మాజీ కెప్టెన్, బ్యాటర్ రికీ పాంటింగ్ ఈ ట్రోఫీలో సచిన్ తర్వాత అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో ప్లేస్‌లో నిలిచాడు. 29 టెస్టుల్లో 54.36 సగటుతో 2,555 రన్స్ సాధించాడు.
- భారత టెస్టు దిగ్గజం వీవీఎస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. లక్ష్మణ్ 29 మ్యాచుల్లో 49.67 సగటుతో 2,437 రన్స్ చేశాడు.
- టీమ్ఇండియా మాజీ రాహుల్ ద్రవిడ్ 32 టెస్టుల్లో 39.68 యావరేజ్ తో 2,143 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో నాలుగో ప్లేస్ దక్కించుకున్నాడు.
- భారత్ నయా వాల్, టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా 25టెస్టుల్లో 49.78 సగటుతో 2074 రన్స్ బాదాడు. దీంతో అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.