BCCI Pension For Retired Players : ప్రభుత్వ ఉద్యోగులకు అయితే రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ వస్తుంది. అది వారి జీవనోపాధికి, ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. అయితే క్రికెటర్లకు రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటి? వారికి పెన్షన్ వస్తుందా? ఎంతమొత్తంలో పెన్షన్ వస్తుంది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెన్షన్ ఎవరిస్తారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ప్రసిద్ధి చెందింది. అలాగే బీసీసీఐకి ఆదాయం కూడా భారీ మొత్తంలోనే వస్తుంది. అందుకే బీసీసీఐనే మాజీ క్రికెటర్లకు పెన్షన్ ను అందిస్తుంది. రెండేళ్ల కిందటే (2022లో) బీసీసీఐ పురుష, మహిళా మాజీ ఆటగాళ్లకు నెలవారీ పెన్షన్లను పెంచింది.
2002లో పెన్షన్ పెంపు ప్రకారం లెక్కలు
గతంలో నెలకు రూ. 15,000 అందుకున్న మాజీ ఫస్ట్ క్లాస్ పురుష క్రికెటర్లకు ప్రస్తుతం రూ. 30,000 పెన్షన్ అందుతోంది. మాజీ టెస్ట్ ఆటగాళ్ల పెన్షన్ ను రూ. 37,500 నుంచి రూ. 60,000కు పెరిగింది. గతంలో రూ. 50,000 పెన్షన్ ఉన్నవారు ప్రస్తుతం రూ. 70,000 వరకు పెన్షన్ ను తీసుకుంటున్నారు.
మహిళా క్రీడాకారిణిలకు సైతం!
మహిళా అంతర్జాతీయ క్రీడాకారిణులకు కూడా పెన్షన్ పెంచింది బీసీసీఐ. 2003కి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన ఫస్ట్ క్లాస్ ఒమెన్ క్రికెటర్లకు గతంలో రూ. 22,500 పెన్షన్ పొందారు. దాన్ని రూ.45,000కి పెంచారు. గతంలో రూ. 22,500 పెన్షన్ ఉన్నవారు ప్రస్తుతం రూ. 45,000 వరకు పెన్షన్ ను తీసుకుంటున్నారు.
మాజీలకు అండగా బీసీసీఐ పెన్షన్
భారత మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ వంటివారు మాజీలకు పెన్షన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లే ఒకానొక సమయంలో పెన్షన్ డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టికొస్తున్నానని వ్యాఖ్యానించాడు. పెన్షన్ తోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని, అందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. కాగా, దాదాపు 900 క్రికెటర్లు బీసీసీఐ నుంచి పెన్షన్ ను పొందుతున్నట్లు తెలుస్తోంది. వారందరూ ఉద్యోగుల్లా నెలకు కొంత మొత్తం బీసీసీఐ పెన్షన్ రూపంలో ఇస్తోంది.
టీ20 వరల్డ్ కప్ టు టెస్ట్ క్లీన్ స్వీప్! - 2024లో భారత క్రికెట్‌లో జరిగిన కీలక అంశాలు ఇవే!
2024లో భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం - ఐపీఎల్ వ్యూవర్‌షిప్‌తో రూ.4200 కోట్ల లాభం!