తెలంగాణ

telangana

టీమ్​ఇండియా మెన్స్‌ టీమ్‌ స్టాఫ్‌లో ఉన్న ఏకైక మహిళ - ఎవరంటే? - Rajal Arora BCCI

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 10:30 PM IST

Rajal Arora BCCI : టీమ్‌ ఇండియా స్టాఫ్‌లో ఒకే ఒక మహిళ ఉన్నారు. అప్పుడప్పుడు టీమ్‌ ఇండియా సోషల్‌ మీడియా పోస్టుల్లో ఆమెని చూసే ఉంటారు. ఇంతకీ ఆమె బాధ్యతలు ఏంటి? ఆమె ఏం చేస్తారో తెలుసా?

Source ANI and Getty Images
Rajal Arora BCCI (Source ANI and Getty Images)

Rajal Arora BCCI :టీమ్‌ ఇండియా పురుషుల క్రికెట్‌ టీమ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌లో సాధారణంగా అందరూ పురుషులే ఉంటారని అనుకుంటారు. తరచూ ఫారిన్‌ టూర్‌లు, సుదీర్ఘ షెడ్యూల్స్‌ ఉంటాయి కాబట్టి మహిళలు ఉంటారని ఊహించరు. కానీ భారత జట్టు స్టాఫ్‌లో ఓ మహిళ ఉన్నారు. అప్పుడప్పుడు టీమ్‌ షేర్‌ చేసిన కొన్ని ఫొటోస్‌లో ఆమెను మీరు చూసుంటారు. కచ్చితంగా ఆమె ఎవరు? అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.

ఉదాహరణకు 2023 డిసెంబర్‌ 10న దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌ జరిగినప్పుడు రింకూ సింగ్, ప్లేయర్స్‌తో దక్షిణాఫ్రికాకు ట్రావెల్‌ చేస్తున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అందులో కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కోచింగ్ స్టాఫ్ కనిపించారు. వారి మధ్యలో ఓ అమ్మాయి నిల్చుని ఉంది. ఈ ఫొటో చూసి చాలా తక్కువ మందికే ఆమెవరనే సందేహం వచ్చుంటుంది. దీంతో చాలా మంది ఆమె గురించి అప్పుడే ఆరా తీసి మరి కనుకొన్నారు. రాజల్ అలియాస్ రాజ్ లక్ష్మి అరోరా తన పేరు అని తెలుసుకున్నారు.

మరోసారి, 2024 జనవరిలో దక్షిణాఫ్రికా, కేప్‌టౌన్‌లో భారత్ టెస్ట్‌ జట్టు రికార్డు విజయం అందుకున్న తర్వాత దిగిన ఫొటోలో కూడా ఆమె కనిపిస్తుంది. గ్రౌండ్‌లో మెన్స్‌ క్రికెట్‌ టీమ్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌ మధ్య అదే అమ్మాయి కనిపించడంతో? మరింత మంది ఆమె ఎవరనే క్యూరియాసిటీ చాలా మందిలో కలిగింది. ఆమె గురించి మరోసారి తెలుసుకుందాం.

  • అంతర్గత ఫిర్యాదు కమిటీకి బాస్
    బీసీసీఐ సోషల్ మీడియా మేనేజర్‌గా దాదాపు తొమ్మిదేళ్ల పాటు అరోరా పనిచేశారు. ఆ తరువాత సీనియర్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చేపట్టారు. భారత జట్టు సోషల్ మీడియా టీమ్‌ను లీడ్ చేస్తూనే బీసీసీఐలో అంతర్గత ఫిర్యాదు కమిటీకి కూడా హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటగాళ్ల దుష్ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులను ఆమె పర్యవేక్షిస్తారు.
  • పూణేలో ఉన్నత విద్య
    ఆమె పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కంటెంట్ రైటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరోరా, 2015లో సోషల్ మీడియా మేనేజర్‌గా బీసీసీఐలో చేరారు.
  • సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్
    రాజ్‌లక్ష్మి అరోరా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, X (ట్విట్టర్)లో 60k, 29k ఫాలోవర్స్‌ ఉన్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌పామస్‌లో 'రాజల్ అరోరా' అనే యూజర్ పేరుతో ఆమె అకౌంట్‌ ఉంది. టీమ్‌ ఇండియా బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ కేఎల్ రాహుల్ భార్య, బాలీవుడ్ నటి అథియా శెట్టితో రాజల్‌ అరోరాకు సత్సంబంధాలు ఉన్నాయి. చాలా సార్లు సోషల్ మీడియా పోస్ట్‌లలో కలిసి కనిపిస్తారు. అరోరా ఇన్‌స్టా అకౌంట్‌ను కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, ఇషాంత్ శర్మ వంటి ఆటగాళ్లు ఫాలో అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details