BCCI Annual Contract : 2023-24వ ఏడాదికిగానూ టీమ్ఇండియా బీసీసీఐ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రేడ్ ఏ ప్లస్, ఏ, బీ, సీలోకి ఆయా ప్లేయర్ల కాంట్రాక్ట్‌లను సవరించింది. అయితే ఈ లిస్ట్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను చేర్చకపోవడం గమనార్హం. ఇక గ్రేడ్ ఏ ప్లస్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను చేర్చింది.
ఆ తర్వాతి గ్రేడ్ అయిన 'ఏ'లో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. అయితే గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్య ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలుపుకున్నాడు. ఇక బీలో ఉన్న కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లకు ఏ క్లాస్‌కి ప్రమోషన్ దక్కింది.
ఇక బి కేటగిరీలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను లిస్ట్‌లో నుంచి తొలగించింది. గతేడాది కాంట్రాక్ట్‌లో లేని యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఈ సారి నేరుగా బీ గ్రేడ్‌లోకి ప్రవేశించాడు. దీంతో ఈ కేటగిరీలో జైస్వాల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు ఉన్నారు.