BAI Paralympics Cash Rewards :పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ ప్లేయర్ల కోసం బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) నజరానా ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదుగురు షట్లర్లకు కలిపి రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బాయ్ అధ్యక్షుడు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా ప్రకటించారు.
బ్యాడ్మింటన్‌లో ఐదు పతకాలు
కాగా, పారిస్ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు ఐదు పతకాలు దక్కాయి. అందులో ఒకటి స్వర్ణం కాగా, చెరో రెండు రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ SL 3 విభాగంలో నితేశ్ కుమార్ స్వర్ణాన్ని సాధించాడు. మరో షట్లర్ సుహాస్ యతిరాజ్ రజతాన్ని ముద్దాడాడు. మహిళల సింగిల్స్ SU 5లో తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించారు. కాగా, SH 6 విభాగంలో నిత్య శ్రీ శివన్ కాంస్యం సాధించింది. ఈ షట్లర్లలో నిత్య శ్రీ శివన్, తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్లుగా చరిత్ర సృష్టించారు.
అయితే బ్యాడ్మింటన్ అసోషియేషన్ ప్రకటించిన ఈ నజరానాలో గోల్డ్ గెలిచిన నితేశ్‌కు రూ.15 లక్షలు దక్కనున్నాయి. రజత పతక విజేతలైన సుహాస్, తులసిమతికి చెరో రూ. 10 లక్షలు అందనున్నాయి. ఇక కాంస్య పతక విజేతలు చెరో రూ.7.5 లక్షలు దక్కనున్నాయి. కాగా, పారాలింపిక్స్