Babar Azam Retirement : పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ జట్టు తదుపరి సారథిగా ఎవరు బాధ్యతలు చేపడుతారనే విషయం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసిన పాక్ సేన, అమెరికా చేతిలో కూడా ఓడి సూపర్-8కు కూడా చేరుకోలేక పోయింది. దీంతో ఈ గాయం నుంచి కోలుకుని తమను గట్టెక్కించే కెప్టెన్‌ను తమ జట్టుకు ఎంచుకోవాలని పాక్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇద్దరు ప్లేయర్ల పేర్లు ప్రస్తుతం పరిగణలో తీసుకోవాంటూ వాదనలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయమై పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఫకార్ జమాన్ లేదా మహ్మద్ రిజ్వాన్ లలో ఒకరు కెప్టెన్ అవుతారంటూ అభిప్రాయపడ్డాడు.
"కెప్టెన్సీ నుంచి వైదొలగటం బాబర్ అజామ్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా మనం చాలాసార్లు పెద్ద ప్లేయర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తాం కానీ అది తప్పు అని నేను నమ్ముతున్నాను. పాక్ తదుపరి సారథిగా మహ్మద్ రిజ్వాన్ లేకుంటే ఫకార్ జమాన్‌ను పరిగణించాల్సిందని నా అభిప్రాయం. పాక్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనలో బాగా రాణిస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత జట్టులో యంగ్ ప్లేయర్లు కూడా ఉన్నారు. జట్టు ఎంపికలో కొన్ని సమస్యలను కచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. టెస్టు కోచ్‌గా ఉన్న జాసన్ గిల్లెస్పీతో కలిసి ఆడాను. అతను పాకిస్థాన్ జట్టును మెరుగుపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు" అని యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు.