తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాబర్ షాకింగ్ డెసిషన్- కెప్టెన్సీకి గుడ్​బై- ఏడాదిలో ఇది రెండోసారి - Babar Azam Captaincy - BABAR AZAM CAPTAINCY

Babar Azam Captaincy : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్​ కెప్టెన్సీకి గుడ్​ బై చెప్పాడు.

Babar Azam Captaincy
Babar Azam Captaincy (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 2, 2024, 8:03 AM IST

Updated : Oct 2, 2024, 8:46 AM IST

Babar Azam Captaincy :పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మట్ కెప్టెన్సీకి గుడ్​బై చెప్పేసిన బాబార్ తాజాగా వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. తన నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలిపినట్లు చెప్పాడు. పాకిస్థాన్​కు కెప్టెన్​గా వ్యవహరించే అవకాశం దక్కడం తనకు ఎంతో గౌరవం అని అన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

'డియర్ ఫ్యాన్స్, మీతో ఓ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పాకిస్థాన్ కెప్టెన్సీకి గుడ్​ బై చెప్పేస్తున్నా. నా నిర్ణయాన్ని గతనెల పీసీబీ మేనేజ్​మెంట్​కు​ చెప్పాను. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్​గా చేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవం. ఇదొక మంచి అనుభవం. కానీ, ఇది కాస్త పనిభారం పెంచుతుంది. నేను పూర్తిగా బ్యాటింగ్​పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. అలాగే నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నా. అందుకే కెప్టెన్సీ వదులుకుంటున్నా. ఓ ప్లేయర్​గా పాకిస్థాన్ క్రికెట్​కు నా అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తా. ఇన్ని రోజులు నాకు మద్దతుగా నిలిచిన మేనేజ్​మెంట్, ఫ్యాన్స్​కు థాంక్స్' అని బాబర్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

కాగా, బాబర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టాప్ 10లో స్థానం కోల్పోయిన కాసేపటికే తన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఇక ఏడాదిలో బాబర్ కెప్టెన్సీ వదులుకోవడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్​లో బాబర్ ఆజమ్​ టెస్టు ఫార్మాట్​ కెప్టెన్సీకి గుడ్​ బై చెప్పాడు.

Babar Azam Captaincy Record : ఇక బాబర్ 2019లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పట్నుంచి పాకిస్థాన్ జట్టును అన్ని ఫార్మాట్లలో సమర్థంగా నడిపించాడు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ మూడు ఫార్మాట్లలో 84 మ్యాచ్​లు నెగ్గింది. పాక్ క్రికెట్​లో రెండో అత్యత్తమ కెప్టెన్​గానూ నిలిచాడు. కానీ, గత ఏడాదిగా పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్, 2024లో జరిగిన టీ20 వరల్డ్​కప్​ టోర్నీల్లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది.

Last Updated : Oct 2, 2024, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details