T20 Worldcup 2024 Teamindia : టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ స్టేజ్‌లో టీమ్ఇండియా మంచిగానే రాణిస్తోంది. ఇప్పటివరకు మూడు మ్యాచులు గెలిచి మరో పోరు మిగిలి ఉండగానే సూపర్-8కు అర్హత సాధించింది. ఇక చివరి మ్యాచ్‌ను ఫ్లోరిడా వేదికగా జూన్ 15న కెనడాతో పోటీపడనుంది. ఇందులో గెలిస్తే టేబుల్ టాాపర్గా నిలుస్తుంది. కానీ ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు వెస్టిండీస్‌కు పయనమవుతుంది. కానీ ఇప్పుడు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదేంటంటే ఫ్లోరిడాలో మ్యాచ్ ముగియగానే శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్‌లు స్వదేశానికి తిరిగి వచ్చేలా నిర్ణయం తీసుకుందట.
ప్రస్తుతం వీరిద్దరు రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్‌తో పాటు ట్రావెలింగ్ రిజర్వులుగా ఉన్నారు. 15 మంది సభ్యులు గల టీమ్‌లో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో వీరిలో ఒకరిని ఎంపిక చేసి ఆడిస్తారు. కానీ ఇప్పటి వరకు అలాంటి అవసరం భారత్‌కు రాలేదు.
T20 Worldcup 2024 Reserve Players :కాగా, రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనర్‌గా దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఓపెనర్ అయిన యశస్వి జైశ్వాల్ బెంచీకే పరిమితం అయ్యాడు. దీంతో మరో ఓపెనర్ అయిన గిల్ సేవలు ఈ వరల్డ్‌కప్‌లో అవసరం లేదని మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది.