Matthew Wade Retirement : త్వరలో జరగనున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కంటే ముందే ఆస్ట్రేలియా టీమ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే దేశవాళీ లీగ్‌లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు.
2011లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన ఈ స్టార్ ప్లేయర్ ఆ జట్టు తరఫున 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ ఫార్మాట్లో ఆడాడు. ఇక తన క్రికెట్ కెరీర్లో 200కి పైగా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లలో అతనికి తగినన్ని అవకాశాలు లభించడం లేదు. 2024 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న సమయంలోనూ అతడికి నిరాశే మిగిలింది. దీంతో 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఆడిన ఇన్నింగ్సే తన చివరి మ్యాచ్ అయ్యింది.
ఆ మ్యాచ్‌లో వేడ్ కీలకం
2021లో టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్ గెలుచుకుంది. ఆ సమయంలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వేడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 17 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు ఉండటం విశేషం.