2024 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? - Asia Cup 2024 Schedule
Asia Cup 2024 Schedule: 2024 మహిళల ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీ జూలై 19న ప్రారంభమై 28న ముగుస్తుంది. మరి ఏయే మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు జరగనున్నాయంటే?
Asia Cup 2024 Schedule:2024 మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజైంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన 9వ ఎడిషన్ టోర్నమెంట్ జూలై 19న ప్రారంభమై 28న ముగుస్తుంది. ఈ ఎడిషన్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. గత సీజన్‌లాగే ఈసారి కూడా టీ20 ఫార్మాట్లోనే టోర్నమెంట్ జరగనుంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా మొత్తం 8జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
మొత్తం గ్రూప్ దశలో 12మ్యాచ్‌లు ఉండనున్నాయి. జూలై 26న సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో నెగ్గిన జట్లు 28న జరిగే ఫైనల్‌కు దూసుకెళ్తాయి. ఇక అన్ని జట్లు తమతమ ప్లేయర్లను ప్రకటించాల్సి ఉంది.
కాగా, గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ ఉండగా, గ్రూప్ Bలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఇక టీమ్ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఇప్పటికే అత్యధికంగా 7సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతుంది. ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగ్గా అందులో భారత్ 7సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఒక్కసారి బంగ్లాదేశ్ టైటిల్ నెగ్గింది.
భారత్- పాకిస్ధాన్ మ్యాచ్: ఈ టోర్నీలో తొలిరోజే హై వోల్టేజ్ గేమ్ భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌కు దంబుల్లా మైదానం వేదిక కానుంది. జూలై 19 రాత్రి 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో టీమ్ఇండియా 6సార్లు పాకిస్థాన్‌తో తలపడగా అన్నింట్లోనూ విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా ఈ ఇరుజట్లు 14టీ20 మ్యాచ్‌ల్లో పోటీపడగా భారత్ 11సార్లు, పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
పూర్తి షెడ్యూల్
జులై 19
యూఏఈ vs నేపాల్
జులై 19
భారత్ vs పాకిస్థాన్
జులై 20
మలేషియా vs థాయిలాండ్
జులై 20
శ్రీలంక vs బంగ్లాదేశ్
జులై 21
భారత్ vs యూఏఈ
జులై 21
పాకిస్థాన్ vs నేపాల్
జులై 22
శ్రీలంక vs మలేషియా
జులై 22
బంగ్లాదేశ్ vs థాయిలాండ్
జులై 23
పాకిస్థాన్ vs యూఏఈ
జులై 23
భారత్ vs నేపాల్
జులై 24
బంగ్లాదేశ్ vs మలేషియా
జులై 24
శ్రీలంక vs థాయిలాండ్
జులై 26
సెమీ ఫైనల్- 1
జులై 26
సెమీ ఫైనల్- 2
జులై 28
ఫైనల్
అన్ని మ్యాచ్‌లు శ్రీలంక దంబుల్లా స్టేడియంలోనే జరగనున్నాయి. రోజుకు రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు తొలి మ్యాచ్, రాత్రి 7.00 గంటలకు రెండో మ్యాచ్ ఉండనుంది.