Ashwin 500 Wickets Test:టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500వ వికెట్ల ఘనతను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో జాక్ క్రాలీని ఔట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. దీంతో అశ్విన్ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ 800 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఒక్కడే ఆశ్విన్ కంటే ముందున్నాడు.
'నా కెరీర్లో టెస్టు క్రికెట్ సుదీర్ఘ ప్రయాణం. ఈ రికార్డు (500వ వికెట్)ను నా తండ్రికి అంకితమిస్తున్నా. నా లైఫ్‌లో చాలా కష్టపడ్డ. మా నాన్న ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉన్నాడు. 500 వికెట్ల మార్క్ అందుకోవడం హ్యాపీగా ఉంది. ఆటలో మేం ప్రస్తుతానికి బ్యాలెన్స్‌గానే ఉన్నాం' అని మ్యాచ్ అనంతరం అశ్విన్ చెప్పాడు. ఇక అశ్విన్ ఈ ఘనత సాధించడం పట్ల పలువురు మాజీలు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, 'అశ్విన్ ది స్పిన్నర్, ఎప్పుడూ విన్నరే. టెస్టుల్లో 500 వికెట్లు అందుకోవడం ఓ మైలురాయి. కంగ్రాట్స్, ఛాంపియన్!' అని ట్వీట్ చేశాడు.
మోదీ ప్రశంస: 'టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్న కంగ్రాట్స్ రవిచంద్రన్ అశ్విన్‌కు నా అభినందనలు. అతడి విజయాలు నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనం. అతడు కెరీర్లో మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటున్నా' అని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.