తెలంగాణ

telangana

ఓ ఇంటివాడైన రషీద్ ఖాన్- పెళ్లి వీడియో వైరల్! - Rashid Khan Marriage

Rashid Khan Marriage : అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అఫ్గాన్ రాజధాని కాబుల్​లో ఓ ప్రైవేటు హోటల్​లో అతడి పెళ్లి గ్రాండ్​గా జరిగింది.

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Rashid Khan Marriage
Rashid Khan Marriage (Source: Getty Images)

Rashid Khan Marriage :అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. అక్టోబర్ 03న రాజధాని నగరం కాబుల్​లో ఓ ప్రైవేటు హోటల్​లో రషీద్ పెళ్లి గ్రాండ్​గా జరిగింది.పెళ్లి కోసం వెడ్డింగ్ హాల్​ను ఫుల్ లైటింగ్​తో గ్రాండ్​గా డిజైన్ చేశారు. ఈ పెళ్లి వేడుకకు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు సీఈఓ నసీబ్‌ ఖాన్‌తో పాటు సీనియర్‌ ఆటగాళ్లు మహమ్మద్‌ నబీ, ముజీబ్‌ అర్‌ రెహ్మాన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు హాజరయ్యారు. వివాహ వేడుకకు సంబంధించి వెడ్డింగ్ హాల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే, రషీద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

కాగా, రషీద్‌తో పాటు అతడి ముగ్గురు సోదరులు జకియుల్లా, రజా ఖాన్‌, అమీర్‌ ఖలీల్‌ కూడా ఒకేసారి వివాహం చేసుకున్నారు. ఈ నలుగురు నలుపు రంగు కుర్తా, పైన మెరూన్ కలర్ జాకెట్ ధరించారు. ఇక సంప్రదాయ పష్తూన్‌ ఆచారాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అయితే రషీద్ సడెన్​గా పెళ్లి వార్త చెప్పడంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక రషీద్​కు ఫ్యాన్స్​ సహా, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'వన్ అండ్ ఓన్లీ కింగ్ ఖాన్, రషీద్ ఖాన్​కు శుభాకాంక్షలు. జీవితాంతం నీకు విజయం కలగాలని కోరుకుంటున్నా' అని సీనియర్ స్పిన్నర్ మహ్మద్ నబీ ట్విట్టర్​లో పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు.

కాగా, రషీద్ ఖాన్ ప్రస్తుతం ప్రపంచ నెెం.1 టీ20 బౌలర్​గా కొనసాగుతున్నాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్ గత 9ఏళ్లుగా జట్టులో కీలకంగా మారాడు. ఇప్పటివరకు 93 టీ20 మ్యాచ్​ల్లో 152 వికెట్లు, 105 వన్డేల్లో 190 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో రషీద్ పెద్దగా ఆడలేదు. ఆడింది 9 ఇన్నింగ్సే అయినప్పటికీ అందులోనూ 34 వికెట్లతో రాణించాడు. గతనెల దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​లోనూ స్పిన్నర్ రషీద్ ఖాన్ అదరగొట్టాడు.

క్రికెట్​లో అఫ్గానిస్థాన్ మార్క్- సంచలన ప్రదర్శనలకు కేరాఫ్ అడ్రస్! - SA vs AFG ODI Series

అఫ్గాన్​లో క్రికెట్​పై బ్యాన్- తాలిబన్ ప్రభుత్వం ప్లాన్! - Afghanistan Cricket Ban

ABOUT THE AUTHOR

...view details