తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ సక్సెస్‌ అంత ఈజీగా రాలేదు'- క్రికెట్​లో అఫ్గానిస్థాన్‌ జర్నీ ఇదే! - Afghanistan Cricket Team Journey - AFGHANISTAN CRICKET TEAM JOURNEY

Afghanistan Cricket Team Journey : అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్న టీమ్‌ల లిస్టులో నుంచి అఫ్గానిస్థాన్‌ పేరును తొలగించాల్సిన సమయం వచ్చింది. ఈ స్థాయి సక్సెస్‌ అఫ్గానిస్థాన్‌కి అంత సులువుగా దక్కలేదు. ఇతర దేశాల సాయంతో కఠిన పరిస్థితులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. ఇంతకీ ఈ జట్టు క్రికెట్‌ జర్నీ ఎలా సాగిందంటే?

Afghanistan Cricket Team Journey
Afghanistan Cricket Team Journey (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 8:13 PM IST

Afghanistan Cricket Team Journey :ఇంతకు ముందు ప్రపంచ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్‌ని చిన్న జట్టుగా పేర్కొనేవారు. 2024 టీ20 వరల్డ్‌ కప్‌ ముందు కూడా చిన్న టీమ్‌లలో పెద్ద జట్టుగా పరిగణించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద టీమ్‌లకు షాక్‌ ఇస్తూ, తొలిసారి అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్స్‌కి దూసుకెళ్లింది.

గ్రూప్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌, సూపర్‌ 8లో ఆస్ట్రేలియాని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం అందుకుని, సెమీస్‌లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో బలపడుతున్న ఆఫ్ఘాన్‌ క్రికెట్‌ జట్టు కృషి, పట్టుదల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అఫ్గానిస్థాన్‌ క్రికెట్ ప్రయాణం
1995లో క్రికెట్‌ బోర్డును ఏర్పాటు చేశారు. తొలుత దీనిపై కూడా తాలిబన్లు నిషేధం విధించారు. కొన్నాళ్లకు ప్రజల్లో ఆదరణ, అభ్యంతరకరం కాని వస్త్రధారణ ఉండటంతో నిషేధం తొలగించారు. 2001లో తొలిసారి జాతీయ జట్టును తయారు చేశారు. 2009లో వన్డే హోదా, 2013లో ఐసీసీ అసోసియేట్‌ సభ్యత్వం, 2017లో టెస్ట్‌ హోదా లభించాయి. మొదటి నుంచి ఆప్ఘానిస్థాన్‌లో క్రికెట్‌కి ఆదరణ పెరుగుతూ వచ్చింది.

తాలిబన్ల సహకారం
వాస్తవానికి 2019లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చే నాటికి ఈ జట్టు 'అఫ్గాన్‌ రిపబ్లిక్‌' గుర్తు, జాతీయ గీతంతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేది. దేశంలో తిరుగుబాటు తర్వాత పరిస్థితి మారింది. కానీ, ఈ జట్టు పాత జెండా, జాతీయ గీతంతోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు తాలిబన్లు అనుమతించారు. తమ జట్టులో ప్రతిభను గమనించి గతేడాది 1.2 మిలియన్‌ డాలర్ల నగదు కూడా సమకూర్చారు.

అఫ్గాన్​ ప్లేయర్‌ల కమిట్‌మెంట్‌కి సెల్యూట్‌
అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లలో నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుందని, 30 నిమిషాలు పరిగెత్తమంటే, కనీసం గంట సేపు రన్నింగ్‌ చేస్తారని ఆ జట్టు మాజీ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ చెప్పారు. యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న రోజుల్లో ఆటగాళ్లు తమ ఆత్మీయుల అంత్యక్రియలకు వెళ్లి కూడా ట్రైనింగ్‌కి వచ్చేవారని అసిస్టెంట్‌ కోచ్‌ రయిస్‌ అహ్మద్‌జాయ్‌ పేర్కొన్నాడు. జట్టుకు నిధుల కొరత ఉన్నా ఎలాంటి వంకలు పెట్టరు.

2006లో ఇంగ్లాండ్‌లో తొలిసారి ఆరు కౌంటీ మ్యాచ్‌ల్లో విజయం సాధించి జట్టు స్వదేశానికి వస్తే రిసీవ్‌ చేసుకోవడానికి కూడా ఎవరూ రాలేదు. చాలా మంది ఆటగాళ్ల వద్ద ట్యాక్సీకి డబ్బులు లేకపోవడంతో ఎయిర్‌ పోర్టు నుంచి ఇళ్లకు నడుచుకొంటూ వెళ్లారంటే వారి కమిట్‌మెంట్‌ అర్థం చేసుకోవచ్చు.

అఫ్గానీలకు అండగా భారత్‌
అఫ్గాన్‌కు ఐసీసీ అసోసియేట్‌ సభ్యత్వం రావడానికి భారత్‌ సాయం చేసింది. 2015లో గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తాత్కాలిక 'హోమ్ గ్రౌండ్'గా అందించింది. వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో ఆప్ఘానిస్థాన్‌కి లఖ్‌నవూ తన ఆధునిక ఎకానా క్రికెట్ స్టేడియంను కూడా అందించింది. సూరత్ వంటి నగరాల్లో అనేక ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు. 2014లో, అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి భారత ప్రభుత్వం $1 మిలియన్ గ్రాంట్‌ను ఆమోదించింది.

భారత మాజీ ఆటగాళ్లు లాల్‌చంద్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్ అఫ్గానిస్థాన్‌కి కోచ్‌గా ఉన్నారు. ప్రభాకర్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో అజయ్ జడేజా వారి మెంటర్‌గా వ్యవహరించాడు. ఉమేష్ పట్వాల్, మాంటీ దేశాయ్ కూడా చాలా సంవత్సరాలుగా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌లుగా ఉన్నారు. ఐపీఎల్‌లో కూడా ఆఫ్ఘాన్‌ ప్లేయర్స్‌కి చాలా అవకాశాలు ఇచ్చారు. 2024 సీజన్‌లో కనీసం ఆరు టీమ్‌లలో ఒక్క ఆఫ్ఘాన్‌ ప్లేయర్‌ అయినా ఉన్నాడు.

యూఏఈ సపోర్ట్​
తాలిబన్లు రెండోసారి అధికారం చేపట్టాక అఫ్గానీ క్రికెటర్లకు వీసా సమస్యలు మొదలయ్యాయి. దీంతో యూఏఈ వీరికి సాయంగా ముందుకొచ్చి రెసిడెన్సీ పర్మిట్లను మంజూరు చేసింది. షార్జా క్రికెట్‌ స్టేడియాన్ని హోమ్‌ గ్రౌండ్‌గా వాడుకొనే అవకాశం కల్పించారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా చాలా సందర్భాల్లో ట్రైనింగ్‌కి సంబంధించి సాయం చేసింది.

అఫ్గాన్ ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్​ - వేల సంఖ్య‌లో రోడ్లపైకి వచ్చి సంబరాలు - T20 World Cup 2024

ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్​పై విజయం - సెమీస్​కు చేరిన అఫ్గానిస్థాన్​ - T20 Worldcup 2024

ABOUT THE AUTHOR

...view details