AB De Villiers Virat Kohli:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్- అనుష్క జంట రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో ఓ సందర్భంలో డివిలియర్స్ చెప్పాడు. అయితే తాజాగా అది అబద్ధం అని డివిలిర్స్ అన్నాడు.
'నేను పెద్ద పొరపాటు చేశాను. తప్పుడు సమాచారాన్ని షేర్ చేశాను. అదంతా అబద్ధం. విరాట్- అనుష్క విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆట నుంచి విరామం తీసుకోవడానికి కారణమేదైనా, అతడు తొందరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నా' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
డివిలియర్స్ ఏం అన్నాడంటే?
ఇటీవల డివిలియర్స్ ఫ్యాన్స్‌తో ఆన్లైన్లో చిట్‌చాట్ నిర్వహించాడు. ఆ సమయంలో ఓ అభిమాని విరాట్ గురిచి అడగ్గా, 'కోహ్లీతో టచ్‌లోనే ఉన్నా. రీసెంట్గా మాట్లాడాను. అతడు తన కుటుంబంతో టైమ్ సమయం గడుపుతున్నాడు. కోహ్లీ- అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అందుకే విరాట్ ఫ్యామిలీతో గడుపుతున్నాడు' అని అన్నాడు. దీంతో ఈ విషయం వైరలైంది.