Mens Junior Asia Cup 2024 : జూనియర్ ఆసియాకప్ హాకీలో భారత జట్టు వరుసగా తమ ఖాతాలో మూడో టైటిల్‌ను వేసుకుంది. సూపర్ ఫామ్‌ను కొనసాగించిన ఆ టీమ్, బుధవారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5-3తో మట్టికరిపించింది. ఇక ఆర్జీత్ నాలుగు గోల్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఫైనల్లో భారత్ తరఫున ఆర్జీత్ నాలుగు గోల్స్ (4వ, 18వ, 47వ, 54వ) కొట్టగా, దిల్‌రాజ్ సింగ్ (19వ) ఓ గోల్ సాధించాడు. అయితే ఈ టోర్నీలో ఆర్జీత్ మూడు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచాడు. అంతేకాకుండా ఓ ఫీల్డ్ గోల్ చేశాడు.
మరోవైపు పాకిస్థాన్ జట్టులో సుఫియాన్ (30వ, 39వ) రెండు గోల్స్ చేయగా, హనన్ షాహిద్ (3వ) ఓ గోల్ కొట్టాడు. జపాన్ 2-1తో మలేసియాను ఓడించి టోర్నీలో మూడో స్థానానికి పరిమితమయ్యింది.
అయితే మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 3–1 గోల్స్‌తో మలేసియాపై ఘన విజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌రాజ్ సింగ్ (10వ నిమిషంలో), రోహిత్ (45వ నిమిషంలో), శార్దానంద్ తివారి (52వ నిమిషంలో) చెరో గోల్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మలేసియా తరఫున అజీముద్దీన్ 57వ నిమిషంలో ఏకైక గోల్‌ను సాధించాడు.