Teamindia VS Newzealand Semifinal : భారత క్రికెట్లోని మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్‌లో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి కూడా ఒకటి. టోర్నీ మొత్తం ఆద్యంతం మంచి ప్రదర్శనతో సెమీస్‌కు వెళ్లి న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడింది.
వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 239/8 స్కోర్ చేసింది(2029 ODI World Cup). అనంతరం లక్ష్య చేధనలో టీమ్ఇండియా మ్యాట్ హెన్రీ ధాటికి 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది.
ఈ క్రమంలోనే రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా, ధోనీ క్రీజులోకి దిగారు. జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో రెచ్చిపోయి టీమ్ఇండియా శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. మరోవైపు ధోనీ స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఓవైపు చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా ధోనీ మాత్రం సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో జడేజాపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఊపులో ఉన్న జడ్డూను న్యూజిలాండ్ 47వ ఓవర్లో దెబ్బకొట్టింది. గేమ్‌ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుపోయింది.