Friday Remedies to Become Lucky:శుక్రవారాన్ని లక్ష్మీ దేవత అనుగ్రహించే రోజుగా భావించి చాలా మంది పూజలు చేస్తుంటారు. ఈ సమయంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజ్ కిరణ్ కుమార్ చెబుతున్నారు. అయితే, శుక్రవారం రోజు చేసే కొన్ని తప్పుల వల్ల దరిద్రం కూడా చుట్టుకుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు చేయాల్సిన పనులు ఏంటి? చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం రోజు ఎవరైనా సరే.. లవ్ ప్రపోజల్ చేస్తే వంద శాతం సక్సెస్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని కిరణ్ కుమార్ అంటున్నారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 7, మధ్యాహ్నం 1 నుంచి 2, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శుక్ర హోరు ఉంటుందని.. ఈ సమయంలో లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే శుక్రవారం విలాస వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిందని తెలిపారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శుక్రవారం అనుకూలమైన రోజని అంటున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి శుక్రవారం చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా శుక్ర హోరు సమయంలో నూతన అభరణాలు, గాజులు, పువ్వులు, పండ్లు, సెంట్ సీసాల లాంటి డెకరేటివ్ వస్తువులు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందన్నారు.
"శుక్రవారం ఉదయం 6 -7 గంటల మధ్యలో ఉప్పు కొంటే చాలా మంచిది. ఒక గాజు గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ కలిపి పూజ గదిలో ఉంచితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వ్యవసాయ దారులు కర్జూర, రేగి, సీతాఫలం, బత్తాయి, నారింజ లాంటి పంటలు శుక్రవారం వేయడం మంచిది. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసివస్తుంది. శుక్రవారం మహిళలతో పరిచయం ఏర్పరచుకుంటే అవి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. భార్యభర్తల మధ్య నెలకొన్న విభేధాలు తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలకూ శుక్రవారం బాగా కలిసివస్తుంది."
-మాచిరాజు కిరణ్ కుమార్, జ్యోతిష్య నిపుణులు