What Happens If Lizard Fall On Us :సాధారణంగా అందరి ఇళ్లలో గోడలపై బల్లులు తిరుగుతుంటాయి. అయితే, కొన్నిసార్లు ఇంట్లో తిరుగుతున్నప్పుడు అనుకోకుండా బల్లి మన శరీరంపై పడుతుంది. ఈ క్రమంలోనే చాలా మందికి రకరకాల సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ, శరీరంపై బల్లి పడటం శుభ సంకేతమా? అశుభమా? ఒకవేళ అశుభమైతే ఎలాంటి పరిహారాలు పాటిస్తే చెడు ఫలితాలు కలగవు? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శకున శాస్త్రంలో బల్లి శకునానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే స్త్రీ, పురుషులు ఎవరికైనా సరే శరీరంపై బల్లిపడటం శుభ, అశుభ సంకేతాలను ఇస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అయితే, అది శరీరంపై పడిన ప్రాంతాన్ని బట్టి ఫలితం అనేది ఆధారపడి ఉంటుందంటున్నారు.
- ఎవరికైనా సరే తల మీద బల్లి పడినట్లయితే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అపమృత్యువు దోషం కలిగేటటువంటి సూచనలూ ఉంటాయని శకునశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా బ్రహ్మరంధ్రం మీద అంటే.. నడినెత్తి, మాడు మీద బల్లి పడితే మాత్రం కొంచం మృత్యు భయం ఉంటుందట. అలాకాకుండా శిరస్సుపై వేరే చోట పడితే గొడవలయ్యే ఛాన్సెన్ ఎక్కువగా ఉంటాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- ముఖంమీద బల్లి పడితే వెంటనే మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది శకునశాస్త్రం చెబుతుంది. కనుబొమ్మల మీద పడితే గొడవలు ఎక్కువగా అవుతాయి. కుడి కన్ను మీద పడితే మీరు చేసే పనిలో సక్సెస్ అనేది తగ్గిపోతుంది. ఎడమ కన్ను మీద పడితే కొద్దిగా అవమానాలు ఎదుర్కొంటారట.
- అదే.. కుడి చేవి మీద బల్లి పడితే ఒక చెడు వార్త వినే అవకాశం ఉంటుందట. ఎడమ చెవి మీద పడితే వ్యాపార లాభం కలుగుతుంది. ముక్కు మీద పడితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. అలాకాకుండా ముక్కుకు అటువైపు, ఇటువైపు పడితే కొత్తగా పరిచయాలు ఏర్పడుతాయి. అవి మీకు ప్రయోజనాలను చేకూర్చుతాయంటున్నారు.
- పై పెదవి మీద బల్లి పడితే ధనం ఖర్చవుతుందని, కింది పెదవి మీద పడితే ధనలాభం కలుగుతుందని శకునశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఎవరికైనా సరే బల్లి గడ్డం మీద పడితే మాత్రం పోలీసులను కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టైమ్లో కొంచం గొడవలకు పోకుండా ఉండడం మంచిదంటున్నారు.
- కంఠం మీద పడితే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండెల మీద పడితే పిరికితనం వస్తుందట. మోచేతిపై పడితే ఎదుటివారి నుంచి సహాయం తక్కువగా లభిస్తుంది. మణికట్టు మీద పడితే మాత్రం అవమానాలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి.
- గోళ్లపై పడితే జంతువులవల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వెన్నుపూస మీద పడితే శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారని, పాదాల మీద పడితే వెంటనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. వేళ్ల మీద పడితే మాత్రం కొంచం అనారోగ్య సమస్యలు వెంటాడే ఛాన్స్ ఉంటుందని శకునశాస్త్రం చెబుతుంది.
ఈ ప్రాంతాల్లో పడితే శుభ సంకేతమట!
- బల్లి కుడిభుజం మీద పడితే శుభ సంకేతం. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయట. ఆరోగ్యప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే.. కడుపు మీద పడితే సంతానప్రాప్తి. అంటే పిల్లలు లేని వారికెవరికైనా పొట్ట మీద బల్లి పడితే తొందరలో సంతానం కలిగే ఛాన్స్ ఉంటుందని శకునశాస్త్రంలో పేర్కొనడం జరిగింది.
- ఎవరికైనా సరే బల్లి పిరుదుల మీద పడితే మంచి సంకేతం. ముఖ్యంగా కుడి పిరుదు మీద పడినట్లయితే విశేషమైన ధనలాభం పొందే అవకాశం కలుగుతుందట. అదే మోకాళ్ల మీద బల్లి పడినట్లయితే వాహన లాభం కలుగుతుంది. అలాగే పిక్కల మీద పడితే విశేషమైన సుఖసంపదలు కలుగుతాయట. అదేవిధంగా అరికాళ్ల మీద బల్లి పడితే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
బల్లి పడినప్పుడు ఇలా చేస్తే చెడు జరగదట!