తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశివారికి ఉద్యోగం వచ్చే ఛాన్స్​! ఇష్ట దేవతారాధన మేలు! - Weekly Horoscope

Weekly Horoscope From 11th Aug to 17th Aug 2024 Horoscope : 2024 ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 5:01 AM IST

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From 11th Aug to 17th Aug 2024 Horoscope : 2024 ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 17 తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో ఎదురైనా సవాళ్ళను మనోధైర్యంతో అధిగమిస్తారు. దైవబలం అండగా ఉంది. విద్యార్థులు తీవ్రమైన కృషి పట్టుదలతో విజయాలను సాధిస్తారు. శత్రువుల నుంచి ఆపదలు పొంచి ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారలు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుంది. అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. వృత్తి పట్ల అంకిత భావం చిత్తశుద్ధి అవసరం. వ్యాపారులు ఆశించిన లాభాలను అందుకుంటారు. సంస్థను అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. మత పరమైన, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాలవారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో ఆటంకాలు, సవాళ్లు ఉండవచ్చు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులు పెండింగ్‌ పనులను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. వ్యాపారంలో నష్టాలు పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. అనారోగ్య సమస్యలుండవచ్చు. స్థిరాస్తి రంగం వారికి శుభసమయం నడుస్తోంది. కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. ఆధ్యాత్మిక. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాన్ని పొందడమే కాకుండా వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు అందరితో కలిసి పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో వ్యవహరిస్తే మంచిది. బంధు మిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి చిన్నచిన్న సమస్యలు తప్ప మిగిలినవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. సంపద పెరుగుతుంది. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచాలి. లక్ష్య సాధన కోసం బాగా కష్టపడాలి. వారం మధ్యలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి దేవి ఆరాధన శుభప్రదం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడండి. దైవబలం అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

తుల (Libra) :తుల రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభ వార్తలను అందుకుంటారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు మరియు అమ్మకాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నా అధిగమిస్తారు. ఇతరుల విమర్శలను పట్టించుకోకండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. ఇంట్లో శుభకార్య మూలక ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు వారం ప్రారంభంలో కొత్త బాధ్యతలు చేపడతారు. కొంత కఠిన శ్రమతోనే బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. స్థానచలనం సూచన ఉంది. వ్యాపారస్తులకు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్ కు మేలు చేస్తుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులు చేపట్టిన నూతన బాధ్యతలను తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ధనం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మధ్యవర్తి ద్వారా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు వారం ప్రారంభంలో ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు పేరున్న సంస్థ నుంచి అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రేమ వ్యవహారాలలో పెళ్ళికి అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళతారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details