Vijaya Muhurtham in Vijaya Dashami 2024 : ప్రతీ సంవత్సరం విజయదశమి రోజున.. విజయ ముహూర్తం ఉంటుంది. ఆ ముహూహ్తంలో.. పని ప్రారంభించి, అమ్మమీద భారం వేసి నిజాయతీగా శ్రమిస్తే తప్పక విజయం సొంతం అవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది: 2024వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన శనివారం రోజు మధ్యాహ్న సమయంలో విజయ ముహూర్తం వచ్చింది. అంటే మధ్యాహ్నం 2:03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:49 నిమిషాల మధ్యలో విజయ ముహూర్తం ఉంది. ఈ సమయంలో మంచి పనిని ప్రారంభిస్తే సంవత్సరం అంతా అద్భుతమైన విజయాలు లభిస్తాయని అంటున్నారు.
జమ్మి చెట్టుకు పూజ ఏ విధంగా చేయాలి: విజయ దశమి రోజు జమ్మి చెట్టు వద్ద చేసే పూజ అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుందని అంటున్నారు. పూజ ఎలా చేయాలంటే..?
- ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి.
- ఆ తర్వాత మూడు తమలపాకులు పెట్టాలి. ఆ తర్వాత ఆ తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచాలి.
- ప్రతి పసుపు ముద్దకు పై భాగానా, కుడివైపు, ఎడమ వైపు కుంకుమ బొట్లు పెట్టాలి.
- ఆ మూడు పసుపు ముద్దలకు అక్షింతలు, పూలతో పూజ చేస్తూ మంత్రం చదువుకోవాలి.
- మధ్యలో ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ "ఓం అపరాజితాయై నమః" అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.
- ఎడమ వైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ "ఓం జయాయై నమః" అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.
- కుడి వైపున ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ "ఓం విజయాయై నమః" అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.
- ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఒక్కో పసుపు ముద్ద దగ్గర ఒక్కో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి.
- అలా పూజ చేసిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసుకోవాలి.
- ఆ తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకుని పసుపు, కుంకుమ బొట్లు పెట్టి కాగితం పైన ఓంకారం, స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు తొర్రలో పెట్టాలి.
- అనంతరం ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ శ్లోకం చదువుకోవాలి. "శమీ శమయతే పాపం శమీశతృ వినాశనమ్ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ" అంటూ చదువుతూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం రాకపోతే ఓం అపరాజితా దేవ్యై నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.
- ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు తొర్రలో ఉన్న కాగితాన్ని ఇంటికి తీసుకెళ్లి బీరువాలో భద్రపరచుకోవాలి.
- ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరి మీద అపరాజితా దేవి అంటే రాజ రాజేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి:
నవరాత్రుల్లో అమ్మవారు - ఏ రోజున ఏ రంగు వస్త్రాల్లో దర్శనమిస్తారో తెలుసా?
శరన్నవరాత్రుల వేళ "అఖండ దీపం" వెలిగిస్తున్నారా? - ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదట!
నవరాత్రుల వేళ అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి? - పూజకు ఏ పువ్వులు వాడకూడదు?