Venkateswara Swamy Chinna Sesha Vahanam :తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేవదేవుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 5వ తేదీన అంటే శనివారం ఉదయం పూట మలయప్ప స్వామి చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా చిన శేష వాహనం విశిష్టతను తెలుసుకుందాం.
చిన్నశేష వాహన ప్రాశస్త్యం
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయం అనుసరించి భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి.
ఎవరీ వాసుకి!
మహాభాగవతం ప్రకారం, క్షీర సాగర మధనంలో మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకొని సాగరాన్ని మదించిన సంగతి తెలిసిందే! హిందూ మత విశ్వాసాల ప్రకారం వాసుకి నాగులకు రాజు అని అంటారు.