vastu tips for home:భగవంతుడని ఆరాధించడానికి ప్రతీ ఇంట్లో చిన్నదో పెద్దదో.. ఒక పూజగది ఉంటుంది. అయితే.. ఆ పూజగదిలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పూజ గది ఏ దిక్కులో ఉండాలి?
వాస్తు ప్రకారం.. కొత్తగా ఇంటిని నిర్మించే వారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయకూడదట. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులంటున్నారు.
పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే!
- వాస్తు నిపుణుల ప్రకారం.. పూజ గదిలో విరిగిన విగ్రహాలు లేదా విరిగిన పదార్థాలు ఉండకూడదు. వీటివల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం కలుగుతుందని చెబుతున్నారు.
- ఇంట్లో లేదా పూజ గదిలో రుద్ర ముద్రలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలనుఉంచకూడదట. దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుందని తెలియజేస్తున్నారు.
- మీ పూజ గదిలో ఎప్పుడూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను ఉంచకూడదు.
- వీటికి బదులుగా పూజ గదిలో వెండి, ఇత్తడి, బంగారం లేదా మట్టితో తయారు చేసిన ప్రతిమలు ఉండేలా చూసుకోండి.
- ఇష్టమైన దేవుళ్ల ఫొటో ఫ్రేమ్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
- వాస్తు ప్రకారం ఇంట్లో ఒకే ఒక్క వినాయకుడి విగ్రహం ఉండాలి.
- అలాగే వాస్తు నియమాల ప్రకారం ఎప్పుడూ కూడా పుజ గదిలో నిలబడి లేదా నృత్యం చేస్తున్న గణేశ్ విగ్రహాన్ని ఉంచకూడదు.
- చాలా మంది ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ఇంట్లో శివలింగాన్ని ఉంచకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
- అలాగే శివుడి ఉగ్ర రూపాన్ని చూపించే ఏ విగ్రహాన్ని కూడా పూజ గదిలో పెట్టకూడదట.
- పూజ గదిలో శివుడి ప్రతిమను పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
- అలాగే దుర్గమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
- మహిషాసుర మర్దని స్వరూపం, యుద్ధం చేసే చండికా దేవి రూపం వంటి విగ్రహాలు లేదా చిత్రాలను పూజ గదిలో పెట్టుకోవడం మంచిది కాదట.
- దుర్గామాత విగ్రహాంలో సింహం నోరు మూసుకొని ఉండాలని తెలియజేస్తున్నారు.
- వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి.
- శని, రాహువు, కేతువు లేదా మరే ఇతర గ్రహ దేవతల చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లో అశాంతులు, కలహాలు వచ్చే అవకాశం ఉందట.
- ఇంకా పూజ గదిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉండకూడదని సూచిస్తున్నారు.