Vastu Tips For For Iron Almirah: భారత సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మనం నివసించే గృహం కేవలం ఇల్లు మాత్రమే కాదు. అది మన జీవితం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా సొంత ఇళ్లు నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. సొంత ఇళ్లు అనేది ఒక వ్యక్తికి కేవలం నీడ మాత్రమే కాదు. ఆ వ్యక్తికి ఇల్లు అనేది సర్వస్వం అవుతుంది. అందుకే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మిస్తారు చాలా మంది. వాస్తు ప్రకారంగా ఇళ్లు నిర్మిస్తే, ప్రతికూల శక్తులు ప్రవేశించమని శాస్త్రం చెబుతోంది. అందుకే పురాణాల్లో సైతం వాస్తు రీత్యా గృహాలు నిర్మించుకున్నట్లు అనేక సంఘటనలు మనకు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన శాస్త్రాల్లో ఒకటి. మన సనాతన ధర్మంలో ఆయుర్వేదం మనిషి శరీరానికి సంబంధించిన శాస్త్రం. అయితే వాస్తు శాస్త్రం అనేది నిర్మాణ రంగానికి చెందిన ప్రాచీన శాస్త్రం. వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు వేణుగోపాల్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
నైరుతి వైపు బీరువాలో నగదును పెట్టవచ్చా?
వాస్తు ప్రకారం నైరుతి మూలలో బీరువా పెట్టుకోవచ్చు కానీ అందులో బంగారం, నగదును దాచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఉత్తర దిక్కులో మరో చిన్న బీరువా ఏర్పాటు చేసుకొని అందులో నగదు దాచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసిన బీరువా ఎత్తు నైరుతి బీరువా కన్నా కూడా తక్కువగా, దక్షిణం వైపు చూస్తూ ఉండాలని సూచన చేస్తున్నారు.