Utthana Ekadashi 2024 : హిందూ సంప్రదాయాల్లో కార్తిక మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెలంతా విష్ణుమూర్తి, పరమేశ్వరుడి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ కార్తిక మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని 'ఉత్థాన ఏకాదశి' అంటారు. దీన్నే 'దేవుత్థాని ఏకాదశి' అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పురాణ గాథల ప్రకారం.. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున.. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి.. సరిగ్గా 4 నెలల తర్వాత కార్తిక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడట. అందుకే.. ఈ రోజున శ్రీహరిని పూజించేందుకు భక్తులు బారులు తీరుతారు. ఈ ఉత్థాన ఏకాదశి ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన వచ్చింది. ఉత్థాన ఏకాదశిశ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. మరి ఈ రోజున శ్రీమహా విష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే.. గృహంలో చందన దీపాన్ని వెలిగించాలని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్కుమార్' చెబుతున్నారు. అలాగే ఆలయాల్లో నందా దీపాన్ని వెలిగించాలని అంటున్నారు. మరి ఈ దీపాలను ఎలా వెలిగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఉత్థాన ఏకాదశి నాడు ఇలా చేయండి :
- ముందుగా ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజగదిని సుందరంగా అలంకరించుకోవాలి.
- తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
- ఒకవేళ లక్ష్మీ నారాయణుల ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వర స్వామి.. ఇలా విష్ణు స్వరూపానికి సంబంధించిన చిత్రపటానికి కుంకుమతో బొట్లు పెట్టాలి.
- ఇప్పుడు ఆ ఫొటో వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా ముందుగా సాధారణ దీపం వెలిగించిన తర్వాత చందన దీపాన్ని వెలిగించాలి.
- చందనదీపంవెలిగించేందుకు.. పూజా గదిలో పీటను ఉంచాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి.
- రాగి లేదా ఇత్తడి పళ్లెంలో మూడు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
- తర్వాత తులసి చెట్టు కాండం లేదా వేర్ల నుంచి వచ్చిన చందనాన్ని కొద్దిగా తీసుకోవాలి. (ఈ చందనం బయట పూజా సామాగ్రి అమ్మే చోట లభిస్తుంది.)
- ఇప్పుడు బియ్యప్పిండి, బెల్లం తురుము, ఆవుపాలు, చందనం కలిపి ఒక పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనిని 'చందన దీపం' అంటారు.
- ఇలా సిద్ధం చేసుకున్న చందన దీపాన్ని రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉంచాలి. అలాగే పళ్లానికి మూడు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
- ఆ చందన దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. లేదా ఆ చందన ప్రమిదలో ఆవు నెయ్యిలో ముంచిన 2 కుంభ వత్తులు ఉంచి దీపాన్ని వెలిగించవచ్చు.
- ఇలా ఉత్థాన ఏకాదశి రోజున చందన దీపం వెలిగిస్తే శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో.. సిరి సంపదలు లభిస్తాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
సాయంకాలం ఆలయాల్లో 'నందా దీపం' వెలిగించే విధానం :