Turmeric Water Bathing Benefits : స్నానం చేసేటప్పుడు చాలా మంది నీళ్లలో పసుపు కలుపుకొని స్నానం చేస్తుంటారు. అయితే.. దాదాపుగా మహిళలు మాత్రమే ఈ తరహా స్నానం చేస్తారు. ఇలా స్నానపు నీటిలో పసుపు కలుపుకోవడం వల్ల అదృష్టం తలుపు తడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా లాభాలు పొందడమే కాకుండా.. జ్యోతిష్యపరంగానూ మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతికూల శక్తులను తొలగిస్తుంది :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పసుపు వాటర్‌తో స్నానం చేయడం ద్వారా మీ శరీరం నుంచి పత్రికూల శక్తులు తొలగిపోతాయట. అంతేకాకుండా.. ఇలా చేయడం ద్వారా అదృష్టం, శ్రేయస్సు లభించడంతోపాటు మనసు ప్రశాంతంగా ఉంటుందట.
త్వరగా వివాహం :పసుపు వాటర్‌తో స్నానం చేయడం ద్వారా జ్యోతిష్యపరంగా మీరు పొందే మరో ప్రయోజనమేమిటంటే.. త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుందట. అంటే మీ వివాహం ఆలస్యం అవుతుంటే.. ప్రతీ గురువారం పసుపు నీటితో స్నానం చేస్తే.. త్వరలో మీకు పెళ్లి సెట్ అవుతుందట. దీనితో పాటు గురువారం విష్ణుమూర్తి విగ్రహానికి పసుపుతో అభిషేకం చేయండి. ఇవి రెండూ చేయడం ద్వారా త్వరగా వివాహమై.. మీ జీవితంలో సానుకూలత ఏర్పడుతుందట.
బృహస్పతిని బలపరుస్తుంది : బృహస్పతి అదృష్టం, సంపదకు కారణమని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే.. జాతకంలో గురు దోషం ఏర్పడుతుందట. ఈ ప్రతికూల ప్రభావాన్ని వదిలించుకోవడానికి మీరు పసుపు నీటితో స్నానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రపరంగా పసుపు గణేశుడి రూపం కాబట్టి.. దీనిని అనుసరించడం వల్ల గణపతి అనుగ్రహం కూడా మీకు లభిస్తుందట.