Showering Mistakes According to Astrology : మన సంప్రదాయాలు, ఆచారాల్లో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా సరే స్నానం చేసినప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని మాచిరాజు సూచిస్తున్నారు. ఇందులో చాలా మంది చేసే తప్పుల్లో ఒకటి ఖాళీ బకెట్ని బాత్రూమ్లో అలాగే ఉంచడం. వాస్తు నియమాల ప్రకారం.. స్నానాల గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బకెట్ని ఖాళీగా ఉంచకూడదట. ఒకవేళ బకెట్ని బాత్రూమ్లో పెట్టాల్సి వస్తే దానిని బోర్లించి ఉంచాలట.
స్నానం గదిని శుభ్రంగా ఉంచుకోండి
చాలా మంది స్నానం చేసిన తర్వాత వాడిపారేసిన షాంపూ ప్యాకెట్లను మూలన పడేస్తుంటారు. అలాగే విడిచిన దుస్తులను కింద పడేస్తుంటారు. ఇంకా తడి వస్త్రాలను అలానే బాత్రూమ్లో ఉంచి మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ, ఇలా బాత్రూమ్ అశుభ్రంగా ఉండకూడదు. స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. స్నానాల గది అశుభ్రంగా ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట. కుటుంబంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయని చెబుతున్నారు. కాబట్టి.. స్నానం పూర్తైన తర్వాత విడిచిన వస్త్రాలు గానీ, తడి వస్త్రాలు స్నానాల గదిలో లేకుండా చూసుకోవాలి.
బొట్టు ఇలా పెట్టుకోకూడదు
కొంత మంది మహిళలు తలస్నానం చేసిన తర్వాత.. తల ఆరకుండానే కుంకుమ బొట్టు పెట్టుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ ఇలా చేయకూడదు. ఎప్పుడైనా సరే శిరోజాలు పూర్తిగా తుడుచుకుని.. తడి ఆరిన తర్వాత మాత్రమే మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. లేకపోతే గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుందట.
బకెట్లో మిగిలిన నీళ్లను ఇలా ఉపయోగించకండి
చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లను కాళ్ల మీద పోసుకుంటుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదట.
పదునైన వస్తువులు ఉపయోగించకూడదు
స్నానం చేసిన తర్వాత గోళ్లు తీసుకోవడానికి నెయిల్ కట్టర్ వాడకూడదు. స్నానం చేసే ముందే గోళ్లను కట్ చేసుకోవాలి.