తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఇంట్లో శివలింగం ప్రతిష్ఠిస్తున్నారా? - ఈ నియమాలు తప్పనిసరి! - Rules for Keeping Shivling at Home

Rules for Keeping Shivling at Home: ఇంట్లో మహాశివుడికి నిత్యం పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది.. పూజ గదిలో శివలింగం ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటారు. అయితే.. ఇష్టారీతిన శివ లింగాన్ని ఏర్పాటు చేస్తే సరిపోదని.. కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

Rules for Keeping Shivling at Home
Rules for Keeping Shivling at Home

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 10:03 AM IST

Rules for Keeping Shivling at Home: దేశంలో హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ శివరాత్రి పర్వదినాన అనంత భక్త కోటి.. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణ జపిస్తారు. నదుల్లో పుణ్య స్నానాలు చేస్తూ తరిస్తారు. ఉపవాసం, జాగరణ ఉంటూ.. ఆ భోళా శంకరుడిని శరణు వేడుకుంటారు. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి.. మాఘ మాస బహుళ చతుర్ధశి నాడు వస్తుంది. క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే.. ఈ సంవత్సరం మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు మహాశివరాత్రి వచ్చింది.

అయితే.. ఈ పర్వదినాన్నే.. ఇంట్లో ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని చాలామంది భావిస్తారు. అలాంటి వారు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. వారు మాత్రమే కాదు శివలింగాన్ని అంతకుముందే ప్రతిష్ఠించిన వారు కూడా ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. కచ్చితమైన ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని అంటున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

  • ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదని పండితులు అంటున్నారు.
  • అలాగే శివలింగాన్ని ఎప్పుడూ పూజించలేని ప్రదేశంలో ఉంచకూడదని.. కేవలం పూజ గదిలో మాత్రమే ప్రతిష్ఠించాలని శివపురాణం పేర్కొంది.
  • కైలాస పర్వతం, మహాదేవుని నివాసం, ఉత్తర దిశలో ఉంటుంది. కాబట్టి.. శివలింగం ఇంట్లో లేదా ఆలయంలో ఉన్నా, దాని బలిపీఠం అంటే నీటి ప్రదేశం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలని చెబుతున్నారు.
  • శివలింగం నుంచి ఎల్లప్పుడూ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి శివలింగంపై ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. కొందరు వారానికి ఒకసారి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే ఇంట్లో గందరగోళం ఏర్పడుతుందట. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగానికి ప్రతిరోజూ జలాభిషేకం చేయాలని సూచిస్తున్నారు.
  • నది నుంచి తెచ్చిన రాతితో చేసిన శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే బాగుంటుందట. అది మరింత శ్రేయస్కరం అని చెబుతున్నారు.
  • ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగ పరిమాణం చిన్నగా ఉండాలట. మీ బొటనవేలు పరిమాణం కంటే ఎక్కువ ఉండకూడదని సూచిస్తున్నారు.
  • ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శివలింగాన్ని పూజించాలి. సాధారణ పూజ సాధ్యం కాకపోతే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదట.
  • ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలనుకునే భక్తులు తప్పకుండా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు పండితులు.

ABOUT THE AUTHOR

...view details