Kanakadhara Stotram : నడిచే దైవంగా పేరు గాంచిన శ్రీ ఆది శంకరాచార్యులు ఆశువుగా చెప్పిన కనకధారా స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. కేరళలో ఓ ఇంటికి శంకరులు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కడు పేదరికంలో ఉండడం చూసి తట్టుకోలేని శంకరులు ఆశువుగా చెప్పిన స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం. శంకరుల కృపతో ఆ రోజు ఆ పేదరాలి ఇంట కనక వర్షం కురిసింది.
మానవాళికి శంకరుల వరం కనకధారా స్తోత్రం
ఎవరైతే దారిద్య్ర బాధలతో విసిగి వేసారిపోయి ఉన్నారో, అలాంటి వారు క్రమం తప్పకుండా నియమనిష్టలతో కనకధారా స్తోత్రం పారాయణ చేస్తే ఇంట్లో కనక వర్షం కురవడం ఖాయం. సాక్షాత్తు ఆదిశంకరుల నోటి నుంచి వెలువడిన కనకధారా స్తోత్రం మానవాళికి గొప్ప వరం.
కనకధారా స్తోత్రాన్ని ఎలా పఠించాలి
లక్ష్మీ కటాక్షం కోరుకునే వారు 11 శుక్రవారాలు నియమనిష్టలతో కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే ఇంట్లోకి తప్పకుండా ధన ప్రవాహం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైఅశ్వర్యాలు సమకూరుతాయి.
ఈ నియమాలు తప్పనిసరి
లక్ష్మీ కటాక్షం కోసం కనకధారా స్తోత్రం పారాయణ చేసే వారు ఈ కింద చెప్పిన నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
- కనకధారా స్తోత్రం శుక్రవారం పారాయణ చేసే వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పారాయణం చేస్తే ఫలితం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
- కనకధారా స్తోత్రం పూజ సమయంలో లక్ష్మీదేవి విగ్రహం కానీ, పటాన్ని కానీ ఉంచుకొని పారాయణ చేస్తున్నంత సేపు కుంకుమతో పూజ చేస్తూ ఉండాలి.
- అమ్మవారిని శ్రీగంథంతో అలంకరించాలి.
- కనకధారా స్తోత్రం పారాయణ సమయంలో తామరపూలు, మల్లెలు, జాజిపూలతో అమ్మవారిని పూజించాలి.
- పూజ పూర్తయిన తర్వాత పచ్చ కర్పూరంతో శ్రీమహాలక్ష్మికి నీరాజనం ఇవ్వాలి.
- అమ్మవారికి నైవేద్యంగా తేనె కలిపిన పచ్చిపాలు, కొబ్బరికాయ, అరటిపండ్లు, క్షీరాన్నం వంటివి నివేదించాలి.
- చివరగా దరిద్ర బాధలు పోగొట్టమని మనసులో నమస్కరించుకుని, అమ్మవారి ఎదుట మూడు ఆత్మ ప్రదక్షిణలు చేయాలి.
- ఇలా నియమానుసారంగా 11 శుక్రవారాలు కనకధారా స్తోత్రం పారాయణ చేసినట్లయితే సమస్త దారిద్య్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.