Vastu Tips For Idol Worship in Home : హిందూ పురాణాల ప్రకారం.. ఒక్కో దేవుడి ప్రతిమకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు.. ఆయా విగ్రహాలు నిర్దిష్టమైన శక్తి స్వరూపాన్ని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఇదిలా ఉంటే.. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం మంచిదేనా? ఒకవేళ పూజిస్తే ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇళ్లలో దేవుడి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయొచ్చట. కానీ, పూజ గదిలో(Pooja Room)విగ్రహాలను పెట్టి పూజించే క్రమంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఎందుకంటే.. ఈ విగ్రహాలు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. అంతేకాదు.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి నానా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి, వాస్తుప్రకారం.. ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాలను పూజించాలో ఇప్పుడు చూద్దాం.
సైజ్ :చాలా మందికి దేవుడి విగ్రహాలను ఏ పరిమాణంలో ఉండేవి పూజించాలనే విషయంలో సందేహాలు వస్తుంటాయి. అయితే, వాస్తుప్రకారం.. మీ ఇంటి విస్తీర్ణం ఆధారంగా విగ్రహాల పరిమాణం ఎంచుకోవాలని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అంటే.. చిన్న ఇల్లు ఉన్నవారు అందుకు తగినవిధంగా.. కొంచం పెద్ద ఇల్లు, పూజ గది ప్రత్యేకంగా ఉన్నవారు కొంచం పెద్ద సైజు ప్రతిమలను ప్రతిష్ఠించుకోవచ్చంటున్నారు. ఫలితంగా, ఎనర్జీ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందంటున్నారు వాస్తు పండితులు.
చిత్తశుద్ధితో పూజలు :వాస్తుప్రకారం.. ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజించేవారు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ఒకసారి దేవుడి ప్రతిమ ప్రతిష్ఠించాక డైలీ అభిషేకం, చిత్తశుద్ధితో పూజలు నిర్వహించాలి. అలాగే సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు విగ్రహాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. ఎందుకంటే, వాస్తుప్రకారం.. విగ్రహాన్ని ప్రతిష్ఠించాక పరిశుభ్రంగా చూసుకోకపోతే నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
దెబ్బతిన్న విగ్రహాలు : ఇంట్లో విగ్రహాలను పూజించేవారు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. డ్యామేజ్ అయిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో పూజించకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం.. అలాంటి విగ్రహాలను పూజించడం అశుభకరం. అంతేకాదు.. వీటిని ఆరాధిస్తే పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.