తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వంట గదిలో వాస్తు - ఈ టిప్స్​ పాటించకపోతే ఇబ్బందే! - Kitchen Vastu tips

How to Organize Kitchen as Per Vastu for Better Health: ఇంట్లో అతి ముఖ్యమైన గది కిచెన్​. కుటుంబ సభ్యుల ఆరోగ్యంగా ఉండడంలో.. ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. వంటగదిని నిర్మించేటప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే..

How to Organize Kitchen as Per Vastu for Better Health
How to Organize Kitchen as Per Vastu for Better Health

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 4:12 PM IST

How to Organize Kitchen as Per Vastu for Better Health: జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవాలంటే.. పోషక ఆహారంతోపాటు వాస్తు నియమాలు కూడా పాటించాలని అంటున్నారు వాస్తు నిపుణులు. వంటగది నిర్మాణం, వస్తువుల అమరిక విషయంలో వాస్తు పాటించడం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిదట. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..

వంటగది:వంటగది ఎప్పుడూ ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య దిశలో వంటగదిని ప్లాన్ చేయడం వల్ల ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. వంటగది, రెస్ట్‌రూమ్‌ పక్కపక్కన నిర్మించకూడదంటున్నారు. అలాగే.. కిచెన్​ నేరుగా బెడ్‌రూమ్‌, పూజా గదులు లేదా టాయిలెట్‌ల పైన లేదా దిగువన ఉండకపోవడం చాలా ముఖ్యమంటున్నారు.

తలుపు:వాస్తు ప్రకారం వంటగది తలుపు ఇంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తు సూత్రాల ప్రకారం, సానుకూల శక్తిని ఆకర్షించడానికి కిచెన్​ తలుపు తూర్పు, ఉత్తరం లేదా పడమర వైపు ఉండాలి. దక్షిణం వైపు అస్సలు ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట.

డిప్రెషన్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాస్తు టిప్స్​తో సమస్య పరార్​!

కిటికీలు:ఇక కిచెన్​లోని కిటికీలను కూడా వాస్తు ప్రకారం తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

స్టవ్:ఇక వంట గదిలో స్టవ్ కూడా ఆగ్నేయ కోణంలో ఉంచుకోవాలి. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపుగా ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల సంపద పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

రంగులు: ఇక వాస్తు ప్రకారం వంటగది గోడలకు ఆకుపచ్చ రంగు వేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా శాంతియుతమైన, ఉల్లాసమైన మానసిక స్థితిని ఈ రంగు పెంచుతుంది. వంట గదిలో ఎప్పుడూ నలుపు రంగును, నీలం రంగును ఉపయోగించకూడదట. నలుపు రంగును వంట గదిలో ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావం ఉంటుందట. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక నష్టం జరిగే అవకాశం పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

రిఫ్రిజిరేటర్: రిఫ్రిజిరేటర్‌ను నైరుతి దిశలో ఉంచాలి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్, టోస్టర్, మిక్సర్ గ్రైండర్, జ్యూసర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆగ్నేయ కోణానికి సమీపంలో దక్షిణం వైపు ఉంచటం శుభప్రదం అని చెబుతారు.

స్థలం:వాస్తు ప్రకారం, స్టవ్, సింక్ మధ్య తగినంత ఖాళీ ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అగ్ని, నీటి మధ్య తగినంత దూరం ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణ తగ్గుతుంది. తద్వారా ఇంటి సభ్యులు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

మీ పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టడం లేదా ? - అయితే వాస్తు ప్రకారం ఇలా చేయండి!

ఈ 6 వాస్తు టిప్స్ పాటిస్తే - మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details