తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మస్ట్! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today May 22nd 2024 : మే​ 22న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 4:34 AM IST

Horoscope Today May 22nd 2024 :మే​ 22న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్ధ్యాలతో, తెలివితేటలతో అందరి దృష్టి ఆకర్షిస్తారు. ఉద్యోగులకు మంచి జీతంతో పాటు పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని గొప్ప ఉద్యోగం దొరుకుతుంది. విదేశీయానం కూడా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఘర్షణలు, వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఒక సంఘటన మీకు మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. శివారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వృత్తివ్యాపార రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్ధ యాత్రలకు వెళతారు. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం సూర్య అష్టకం పఠించండి.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తిజీవితం ఓ కీలక ఘట్టానికి చేరుతుంది. బదిలీ, ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి అంశాలు జరుగుతాయి. నూతన బాధ్యతలు చేపడతారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పాత పరిచయాలు, స్నేహాలను పునరుద్ధరించుకునేందుకు, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఇది మంచి సమయం. ఇంట్లో ఆహ్లాకదరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల తప్పకుండా ఉంటాయి. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం శుభకరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన దాని కన్నా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. గృహంలో కలహపూరిత వాతావరణం ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. తగినంత విశ్రాంతి అవసరం. వృత్తివ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. శివాష్టకం పఠిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు తారాబలం అద్భుతంగా ఉంది. వృత్తి వ్యాపారాలవారికి, ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. అన్ని రంగాల వారికి ఆర్ధిక ప్రయోయోజనాలు మెండుగా ఉన్నాయి. అసూయపరులతో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఇంటాబయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా బలపడతారు. మీ ప్రతిభకు, తెలివితేటలకు పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం నడుస్తోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆర్ధికంగా శుభసమయం నడుస్తోంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారు కొంతకాలం వేచి చూస్తే మంచిది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. శనిస్తోత్రం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులు పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చులు పెరగవచ్చు. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది. దైవబలంపై విశ్వాసం ఉంచి ముందుకెళితే విజయం మీదే! ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details