తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ధైర్యంతో పని చేస్తే విజయం మీదే! మీ రాశిఫలం చెక్ చేసుకున్నారా? - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today May 18th 2024 : మే​ 18న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 5:02 AM IST

Horoscope Today May 18th 2024 : మే​ 18న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న గడ్డు పరిస్థితులు తొలగిపోయి మంచి సమయం వస్తుంది. ఇదివరకు వేధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మనశ్శాంతి ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ ఉన్నతమైన ఆలోచనలతో, వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన సదస్సులు, చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారులు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. ఆర్ధిక ప్రయోజనాలు, ప్రమోషన్లు అన్ని శుభాలే జరుగుతాయి.ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒకింత అనిశ్చితి, సందిగ్ధావస్థకు లోనవుతారు. అనుభజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మేలు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతోనూ పెద్దలతోనూ స్థిరాస్తులూ, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చ వాయిదా వెయ్యండి. లేకుంటే మీరు నిరాశ చెందగలరు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులూ రావడం, స్నేహితులనూ, ప్రియమైన వారిని కలుసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి వచ్చిన ఓ శుభవార్తతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ అదృష్టాన్ని మీరే నమ్మలేక పోతారు. మీ పోటీదారులు మీతో గెలవలేక ఓటమిని మౌనంగా స్వీకరిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. డబ్బుకు లోటుండదు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు, కుటుంబ సభ్యుల అండతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు అంత మంచి రోజు కాదు. కొన్ని నష్టాలు ఉన్నా పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువే సంపాదిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలం పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ సరదాగా, సంతోషంగా గడుపుతారు. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఆర్ధిక లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆవేశానికి లోను కాకుండా శాంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆర్ధిక నష్టం సూచితం. ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారిస్తే మేలు. శ్రీ సుబ్రహ్మణ్య ఆలయ సందర్శనం చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కష్టపడి పనిచేసి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ప్రమోషన్ ఛాన్స్, ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆర్ధికంగా విపరీతమైన లాభాలను అందుకుంటారు. అదృష్ట యోగం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. వ్యాపారులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు బిజినెస్ పరంగా ప్రయాణం ఉండవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ తప్పకుండా ఉంది. పితృ సంబంధిత ఆస్తి కలిసివస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. రీసెర్చ్ రంగంలో ఉండేవారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఊహించని విజయాలు సాధించి సంఘంలో మంచి గౌరవం సంపాదిస్తారు. వృత్తి వ్యాపార రంగాల వారికి మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. రచయితలకు, సాహిత్తీ వేత్తలకు శుభసమయం నడుస్తోంది. కీర్తి, ప్రతిష్ట సంపాదిస్తారు. కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి. శనిస్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఈ రోజు చాలా ఇబ్బందులు ఒత్తిడి ఉండే అవకాశం వుంది. ఒత్తిడి కారణంగా కోపం, చిరాకు పెరుగుతాయి మౌనంగా ఉంటూ ధ్యానం చేయడం మంచిది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు భాధపడే అవకాశం వుంది. అందువల్ల వీలైనంతవరకూ మంచి మాటలనే మాట్లాడండి. ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యాచరణ పొందాలంటే సన్నిహితుల అండదండలు అవసరం. ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రోత్సాహం లోపిస్తుంది. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. వ్యాపారులు పోటీదారుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటారు. ధైర్యంతో పని చేస్తే విజయం మీదే! ప్రతికూల ఆలోచనలు వీడితే సానుకూల ఫలితాలే ఉంటాయి. సంపద వృద్ధి చెందడానికి, శత్రు జయం కోసం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

ABOUT THE AUTHOR

...view details