తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంది- జాగ్రత్త పడితే బెటర్! - Horoscope Today March 13th 2024

Horoscope Today March 13th 2024 : మార్చి 13న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 13th 2024
Horoscope Today March 13th 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 5:03 AM IST

Horoscope Today March 13th 2024 : మార్చి 13న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :రోజంతా సుఖశాంతిమయంగా గడుస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎనర్జిటిక్​గా ఉంటారు. కాబట్టి అన్ని పనులు కూడా మీరు అత్యుత్సాహంతో ముగిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు.

వృషభం (Taurus) :మీరు జాగ్రత్తగా ఉండాలి. నిగ్రహం పాటించాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి.

మిథునం (Gemini) :ఆలోచనల విషయంలో ఈ రోజు మీరు చాలా ఊగిసలాటలో ఉంటారు. మీరు చిక్కుల్లో పడతారు. మీ ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. మార్పును క్రమంగా అలవర్చుకోండి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు మీ సమయం అనుకూలంగా ఉంటుంది. అరుదైన బహుమతులను స్వీకరిస్తారు. ఇంటి వద్ద వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

సింహం (Leo) :ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు లక్ష్యం దిశగా నడక ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు మిమ్మల్ని తీరిక లేకుండా చేయవచ్చు. మీరు ఒక తీర్థయాత్రకు ప్రణాళిక వేయవచ్చు. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభ వార్తలు తెలుస్తాయి.

కన్య (Virgo) :మిమ్మల్ని ఏది తికమక పెడుతోంది. మీ మనస్సులో ఒక విప్లవాత్మక ఆలోచన ఉండవచ్చు. మీ స్నేహితులు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ వద్ద ప్రస్తావించి ఉండొచ్చు.

తుల (Libra) :ఈరోజు మీరు పూర్తిగా ఆనందంగా ఉంటారు. మీ పాత స్నేహితుల సాన్నిహిత్యం మీకు ఉత్తేజపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా, ఆనందకరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio) :మీకు చాలా మంచి రోజు. మీరు మీ కుటుంబసభ్యులతో ఎక్కువ సేపు గడుపుతారు. మీ సంతోషం రెట్టింపు అవడానికి మీ ఇంటి వద్ద నుంచి మంచి విషయాలు వింటారు. డబ్బు పరమైన లాభాలు మీ కొరకు ఎదురు చూసున్నాయి.

ధనుస్సు (Sagittarius) :మీరు గ్రహ సమస్యల నుంచి ఇంకా కోలుకున్నట్లు అనిపించడం లేదు. ఫలితంగా పూర్తి అస్వస్థతతో లేదా మానసికంగా అస్థిరంగా భావిస్తారు. మీరు జీర్ణసంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn) :ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు. శారీరకంగా, మానసికంగా అత్యుత్సాహంతో ఉంటారు. అనుకోని సంఘటనలు మీ కుటుంబ సభ్యులను చుట్టుకుని బాధిస్తాయి. మీరు దానికి ఆందోళన చెందుతారు. మీరు నిద్రలేమితో బాధ పడతారు. నీరు పొదుపుగా వాడండి.

కుంభం (Aquarius) : నిర్ణయాలు తీసుకునే మీ శక్తిపై ఆత్మవిశ్వాసం, గందరగోళం ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో ఇబ్బందిపడతారు. మీ రోజువారీ పనుల ప్రకారం వెళ్లండి. పెద్ద ఆలోచనలు, వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం (Pisces) :మీరు ఈరోజు అధిక డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి. మీరు ఎవరినైనా బాధించకుండా ఉండడానికి మీ మాటలు, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. రోజు మొత్తం మీ మానసిక, శారీరక దృఢత్వం సాధారణంగా ఉంటుంది..

ABOUT THE AUTHOR

...view details