తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు నేడు బీకేర్ పుల్- తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు! - Daily Horoscope In Telugu

Horoscope Today July 8th 2024 : జులై​ 8న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 4:50 AM IST

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today July 8th 2024 :జులై​ 8న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఉండవచ్చు. ఉద్యోగులకు కొత్త సవాళ్లు ఎదురవవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా ప్రతిష్ఠకు భంగం వాటిల్లవచ్చు. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. శివ పంచాక్షరీ మంత్ర జపం శక్తినిస్తుంది .

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని పకడ్బందీగా ముందుకు సాగుతారు. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగల శక్తి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రచయితలకు, కళాకారులకు శుభసమయం నడుస్తోంది. సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనులు నెమ్మదిగా సాగుతాయి. సహనంతో ఉంటే మంచిది. పనులు కాస్త ఆలస్యం అయినా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు అప్పగించిన ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పని అద్భుతమైన విజయాలను ఇస్తుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రలకు ప్రణాళికలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. నూతన బాధ్యతలను చేపడతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. విమర్శకుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వద్దు. సమయానుకూలంగా నడుచుకుంటే వృత్తి వ్యాపారంలో విజయం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారులకు ఆర్ధికంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. అనవసరపు వాదనలు, చర్చలకు దూరంగా ఉండండి. ఈశ్వర ఆరాధన శక్తినిస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది. పలు మార్గాల నుంచి డబ్బు రాక కూడా పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలను అందుకుంటారు. నూతనోత్సాహంతో పని చేసి అందరి ప్రశంసలు పొందుతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అదృష్టకరమైన రోజు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సంపద పెరుగుతుంది. ఇళ్లు, స్థలాలు, పొలాలు కొంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని విధంగా పదిరెట్లు లాభాలను అందుకుంటారు. ఉదోగంలో గొప్ప మార్పులు ఉంటాయి. టీమ్ లీడర్, మేనేజర్ వంటి ప్రమోషన్లు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు అనారోగ్య సమస్యల కారణంగా పనులు ఆలస్యం అవుతాయి. సహోద్యోగుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు ఏర్పడవచ్చు. సున్నితమైన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. తొందరపడి కోపావేశంతో మాట్లాడిన మాటల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాలలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో నిష్పాక్షికంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో మీదైనా శైలితో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. మీ పోటీదారులపై విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు విజయం, కీర్తి, వెతుక్కుంటూ వస్తాయి. మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగుల సహకారం పొందుతారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అవకాశవాదులు పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఉండవచ్చు. అవసరానికి ధనం అందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు, విదేశీ పెట్టుబడుల నుంచి ధనప్రవాహాన్ని అందుకుంటారు. మీ పని తీరుకు, పనిలో మీరు చూపే నైపుణ్యం మీకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఉద్యోగులకు అదృష్టం వరించి ఊహించని విధంగా గొప్ప అవకాశాలు ఎదురువస్తాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details