తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 5:01 AM IST

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఆరోగ్యం క్షీణించే అవకాశం! ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది! - Horoscope Today July 2st 2024

Horoscope Today July 2st 2024 : జులై​ 2న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today July 2st 2024
Horoscope Today July 2st 2024 (ETV Bharat)

Horoscope Today July 2st 2024 : జులై​ 2న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం విశేషంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలుంటాయి. ఆర్థికంగా ఎదగడానికి చేసే అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో సుస్థిరమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు ఉంటాయి. విశేషమైన ధనలాభం ఉంటుంది. ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. సహనంతో మెలిగితే మంచిది. వ్యాపారులకు పోటీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు ఆగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి, మిత్రుల నుంచి లబ్ధి పొందుతారు. ఆదాయం ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు అందుతాయి. కీలక వ్యహారాల్లో సమాజంలో గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తి పరమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అధిక పనిభారం అలసటకు గురిచేస్తుంది. తగిన విశ్రాంతి అవసరం. ఇబ్బందులకు గురి చేసే వారు పక్కనే ఉంటారు. అప్రమత్తంగా ఉండండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం పెరుగుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతారు. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. అనవసర గొడవలు, వివాదాలు ఏర్పడకుండా సహనం పాటించాలి. కుటుంబ వివాదాలలో మౌనం వహిస్తే మంచిది. శ్రీరామ నామం జపిస్తే మంచిది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారు పని పట్ల శ్రద్ధ ఏకాగ్రత పెంచాలి. పనుల్లో జాప్యం నివారించడానికి ఎక్కువ కష్టపడాలి. కుటుంబ బాధ్యతల పట్ల దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ధనలాభాలు ఆశించిన మేరకు ఉండవచ్చు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మాటలు అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన వస్తు వస్త్ర లాభలున్నాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభతో, మేధస్సుతో ఆలోచించి కీలకమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారులకు నూతన కార్యసిద్ధి, లక్ష్మీకటాక్షం ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకుంటే మంచిది. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు బద్దకించకుండా ఎప్పటి పనులు అప్పుడే సకాలంలో పూర్తి చేసుకుంటే ఇబ్బందులుండవు. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం వుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు కొంత ఆలస్యంగా అయినా కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. సహనంతో ఉంటే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి మనోబలంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు ఈ రోజు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయాల్లో మొండిగా ఉంటే సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసి శభాష్ అనిపించుకుంటారు. రచయితలకు, కళాకారులకు శుభసమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసే పనికి చెప్పే మాటలకూ పొంతన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. వ్యాపారంలో నష్టాలూ రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగులు పెరిగిన బాధ్యతల పట్ల శ్రద్ధగా తప్పులు లేకుండా పూర్తి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గణపతి ప్రార్థన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details