ETV Bharat / spiritual

ఆ రాశివారికి నేడు బిజినెస్​లో భారీ లాభాలు- లలితా సహస్రనామ పారాయణ శుభకరం! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Horoscope Today 3rd October 2024 : 2024 అక్టోబర్ 3వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today 3rd October 2024 : 2024 అక్టోబర్ 3వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఎలాంటి ఆటంకాలు, ప్రతికూలతలు లేని ప్రశాంతమైన రోజు. ఈ రోజంతా నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా గడిపేస్తారు. సంపాదన పెరగడం వల్ల గతంలో ఉన్న ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్థులను లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. మీ అభివృద్ధిని చూసి మీ కుటుంబ సభ్యులు గర్విస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణ శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీ మృదువైన మాటలతో, ముక్కు సూటి మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. భావోద్వేగాలను అదుపు చేయడంలో విఫలం అవుతారు. కుటుంబ సమస్యలకు సంబంధించిన చర్చలలో సంయమనం పాటించండి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సోదరులతో అనుబంధం దృఢ పడుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో, స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. నిరాశ చెందకండి. వేచి ధోరణి అవలంబిస్తే భవిష్యత్​లో శుభఫలితాలు ఉంటాయి. దూరపు సంబంధాలు బలోపేతం అవుతాయి. కోర్టు వ్యవహారాలలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. మరిన్ని శుభఫలితాల కోసం దుర్గాదేవి ధ్యానం చేయండి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్ధిక వృద్ధి ఉండడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగుటుంది. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా గడుపుతారు. వ్యాపారస్థులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఊహించని లాభాలను అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగంలో పనులు ఆలస్యం కావచ్చు. మీ కోపావేశాల కారణంగా బంధువులతో మనస్పర్థలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ రోజు కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆర్ధిక విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త వహించండి. ఈశ్వర ఆరాధన అనుకూల ఫలితాన్నిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్థులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈ రోజు ఎక్కువగా క్లైంట్లతో సమావేశాలలో పాల్గొంటారు. మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి. వృత్తి పరంగా మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. మీ సూక్ష్మ గ్రహణ శక్తిని అందరూ అభినందిస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అవివాహితులకు, నిరుద్యోగులకు శుభసమయం నడుస్తోంది. మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. కలలు కన్న ఉద్యోగాన్ని పొందుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొనడానికి మీ కోసం కొంత సమయం కేటాయించుకొని ప్రశాంతంగా గడపండి. ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేయకండి. వాస్తవం గుర్తించి నడుచుకుంటే మంచిది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి సంతృప్తినిస్తుంది. వ్యాపారస్థుల భాగస్వాముల సహకారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సినీ, కళా రంగం వారు గొప్ప అవకాశాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.