Horoscope Today July 13th 2024 : జులై 13న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు విశేషకరంగా ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో వేసే ప్రతి అడుగు శుభ ఫలితాలను తెస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ దర్శనం శుభకరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిక్కచ్చిగా, ముక్కుసూటితో ప్రవర్తించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారస్తులు పోటీ దారులు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులు భవిష్యత్ ప్రయోజనాల కోసం కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొంటారు. ఈ కారణంగా కోపం, చిరాకు పెరుగుతాయి. మౌనంగా ఉంటూ, ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారంలో నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు వస్తాయి. నవగ్రహ స్తోత్రం పఠిస్తే ఆపదలు తొలగుతాయి.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్నింటా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. విందువినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి సూచనలు ఉన్నాయి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. ఆర్థికపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్ధికంగా ఎదగడానికి చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. నిరాశ నిస్పృహలకు దూరంగా ఉంటే మంచిది. దైవబలం అనుకూలిస్తోంది. మంచి రోజులు ముందున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆర్థికపరంగా సంతృప్తికరంగా ఉంటారు. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కోపం, పౌరుష పదాల కారణంగా మీ దగ్గర బంధువులతోనూ సంబంధాలను చెడగొట్టుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తే మేలు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం కారణంగా ఈ రోజంతా అశాంతిగా ఉండవచ్చు. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన రోజు. అదృష్టం ఈ రోజు మీకు అనేక అవకాశాలు తీసుకువస్తుంది. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మీ పని తీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తితో ఉంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. సంపద పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. దానధర్మాల కోసం ధనవ్యయం చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. సహచరులు, సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగులు అప్పగించిన పనిని సమర్ధవంతంగా పూర్తి చేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. నూతన బాధ్యతలను చేపడతారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవివాహితులు తమకు కాబోయే జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్ధిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీరికలేని పనులతో విశ్రాంతంగా పనిచేసి అలసిపోతారు. మీకై మీరు కొంత సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని కలవరపెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి ఊహించని గొప్ప అవకాశాలు ఎదురవుతాయి. అనుకోని ధనలాభం ఉంటుంది. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.