తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి నేడు కుటుంబంలో విభేదాలు- కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు! - DAILY HOROSCOPE

2025 జనవరి​ 29వ తేదీ (బుధవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 4:01 AM IST

Horoscope Today January 29th 2025 : 2025 జనవరి​ 29వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో గొప్ప విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. డబ్బుకు లోటుండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశయానం సూచన ఉంది. కీలక వ్యహారాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. అనవసర విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. వృధా ఖర్చులు నివారించాలి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వైద్య ఖర్చులు భారంగా మారుతాయి. కొన్ని అశుభకరమైన సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కీలక విషయాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అవమానకర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. నవగ్రహ ధ్యానంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులకు ఆటంకాలు అవరోధం కలిగిస్తాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారంలో తీసుకునే స్థిరమైన నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రయోజనాన్ని అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. స్థానచలనం సూచన ఉంది. ప్రయాణాలు అనుకూలం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉంటారు. పనుల్లో ఆలస్యం విచారం కలిగిస్తుంది. ఆర్థిక అంశాలు కలిసిరావు. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. మొహమాటానికి పొతే నష్టం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరంగా గొప్ప లాభాలుంటాయి. అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. సన్నిహితులతో విహారయాత్రలు ఆనందం కలిగిస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. బంధువుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. మనోధార్యాన్ని కోల్పోవద్దు. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. వృత్తి పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. గృహంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలం ఉంటుంది. ముఖ్యమైన సమావేశాల్లో మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. ధర్మచింతనతో అందరికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం అండగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామనామ జపం మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అనుకోకుండా ఆర్థిక లాభాలు పొందుతారు. మీ పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయం భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కనకధారా స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details